దసరా రేసు నుంచి కింగ్100 అవుట్?
అఖిల్(akhil)కు లెనిన్(lenin) సినిమాతో వచ్చిన సక్సెస్ తో అక్కినేని ఫ్యామిలీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ముఖ్యంగా నాగార్జున(nagarjuna) ఈ రిజల్ట్ పై ఎంతో సంతృప్తిగా ఉన్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడాయన దృష్టి మొత్తం తన కెరీర్లో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కింగ్100(king100) ప్రాజెక్టుపైనే ఉందని సమాచారం. దసరా సీజన్‌ను టార్గెట్ గా చేసుకుని సినిమా రిలీజ్ అవుతుందనే ప్రచారం జరిగినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఆ ప్లాన్ అమలు అయ్యే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. భారీ సినిమాలు వరుసగా అదే సీజన్‌ను టార్గెట్ చేస్తుండటంతో సరైన టైమ్ ను ఎంచుకోవాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు నాగార్జున, నాగచైతన్య(naga chaitanya), అఖిల్ కలిసి నటించే మల్టీస్టారర్‌పై కూడా గత కొంతకాలంగా ఇంట్రెస్టింగ్ డిస్కషన్స్ సాగాయి. సంక్రాంతి 2027ను దృష్టిలో పెట్టుకుని ఆ ప్రాజెక్ట్ ముందుకు వస్తుందని భావించినా, ప్రస్తుతం దాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. ముందుగా కింగ్100తో ది బెస్ట్ ఇవ్వాలని టీమ్ ప్రాధాన్యంగా తీసుకున్నట్లు సినీ వర్గాల సమాచారం. సినిమా క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా, పూర్తి స్థాయిలో రెడీ అయిన తర్వాతే రిలీజ్ చేయాలనే డెసిషన్ ను మేకర్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ గానీ, ఫస్ట్ లుక్ లేదా గ్లింప్స్ గానీ రిలీజ్ కాలేదు. అయితే ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న తొలి అప్డేట్ ఆగస్టులో నాగార్జున పుట్టినరోజు సందర్భంగా వచ్చే అవకాశాలున్నాయని ప్రచారం సాగుతోంది. రా కార్తీక్(Ra. karthik) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్(Annapurna studios) నిర్మిస్తోంది. రిలీజ్ విషయానికొస్తే డిసెంబర్ లేదా సంక్రాంతి 2027 సీజన్లు కూడా పరిశీలనలో ఉన్నాయని ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. దీంతో కింగ్100 ప్రయాణం ఎలా ఉండబోతోందన్న ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది.








