టిటిఎ కొత్త ప్రెసిడెంట్ గా సహోదర్ పెద్దిరెడ్డి
తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (టిటిఎ) 2027-2028 సంవత్సరానికిగాను కొత్త ప్రెసిడెంట్ గా సహోదర్ పెద్దిరెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా టిటిఎ వ్యవస్థాపకులు పైళ్ల మల్లారెడ్డితోపాటు అడ్వైజరీ కౌన్సిల్ సభ్యులు, ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, వివిధ చాప్టర్ల ప్రతినిధులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన పదవీకాలం విజయవంతంగా సాగాలని, సంస్థను కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. సంఘానికి ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ, అధ్యక్ష బాధ్యతలను ఆయన అప్పగించారు. ఆయన నాయకత్వంలో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ మరింత అభివృద్ధి సాధించి, ప్రవాస తెలుగు సమాజానికి మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడుతుందని ఆశాభావాన్ని పలువురు వ్యక్తం చేశారు.








