యువ ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ వ్యూహాలు..
దేశ వ్యాప్తంగా బీజేపీ మంచి ఊపులో వుంది. యువత, ఉద్యోగులు, మహిళలు.. ఇలా ఒక్క వర్గం ఏమిటి.. అందరూ బీజేపీ వైపు మొగ్గు చూపిస్తున్నారు. యువత కూడా ప్రధాని మోదీ వైపే నిలుస్తున్నారు. దీంతో కాంగ్రెస్ ఇరకాటంలో పడిపోతోంది. సీనియర్లు చెల్లాచెదురు కావడం, సోనియా గాంధీ వయస్సు రీత్యా అంత యాక్టివ్ గా లేకపోవడం లాంటి అంశాలు ఇబ్బందిపెడుతున్నాయి. దీంతో రాహుల్ గాంధీకి మార్గదర్శనం చేసే కోటరీ తగ్గిపోయింది.
దీంతో బీజేపీతో కాంగ్రెస్ పోటీపడలేకపోతోంది. సరిగ్గా ఇదే సమయంలో సీజేపీ ఆందోళనలు ప్రారంభించింది. నీట్ పరీక్షా ప్రశ్నాపత్రం లీకేజీని నిరసిస్తూ జంతర్ మంతర్ దగ్గర భారీ నిరసనలు చేస్తున్నారు. సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ నిరసన దీక్షకు కూడా దిగారు. కానీ.. కాంగ్రెస్ బహిరంగంగా ఎక్కడా మద్దతు పలకలేదు. దీక్షా శిబిరం దగ్గరికి గానీ, జంతర్ మంతర్ దగ్గరికి కానీ కాంగ్రెస్ వెళ్లేలదు.
దీంతో యువత తమ వైపు వస్తారో? లేదో? అన్న భయం కాంగ్రెస్ లో వుండిపోయింది. దీంతో రాహుల్ గాంధీ ఈ విషయంలో విపరీతంగా పంతానికి పోతున్నారు. ఏకంగా ప్రధాని మోదీని, ధర్మేంద్ర ప్రధాన్ ను టార్గెట్ చేశారు. ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక నివాసం ముందే రాహుల్ ధర్నాకు దిగారు. ఇది సంచలనం రేపింది.
దీని ద్వారా యువత విషయంలో తమ పార్టీ సీరియస్ గా వుందన్న మెసేజ్ ను పంపినట్లు అవుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే. దీనిని యువత ఎలా రిసీవ్ చేసుకుంటుందేమో చూడాలి. రాహుల్ ప్రతిదీ లెక్కలతో సహా చెబుతున్నారు. దేశంలో విద్యా వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని, గత పదేళ్లలో ఏకంగా 152 పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని చెప్పుకొచ్చారు. ఒకప్పుడు ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన భారత విద్యా వ్యవస్థ.. మోదీ ప్రభుత్వ హయాంలో అక్రమాలు, లీకేజీలకు నిలయంగా మారిందని మండిపడ్డారు. దేశంలో పేపర్ లీకేజీలు ఒక పెద్ద మాఫియాగా మారాయని, దీని వెనుక ఉన్న బడాబాబులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని రాహుల్ దుయ్యబట్టారు.
‘గత దశాబ్ద కాలంలో దేశంలో ఏకంగా 152 పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయి. దీనివల్ల 7.50 కోట్ల మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనమైంది. ఇన్ని లీకేజీలు జరిగినా ఒక్క బాధ్యుడికి కూడా శిక్ష పడకపోవడం దారుణం. నీట్ లీకేజీ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి. విద్యా వ్యవస్థను నాశనం చేసినందుకు ప్రధాని మోదీ దేశ యువతకు క్షమాపణ చెప్పాల’ని రాహుల్ డిమాండ్ చేశారు. ‘విద్యా రంగానికి కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు సుమారు రూ.1.4 లక్షల కోట్లు అయితే, ప్రతి ఏటా నీట్ వంటి పరీక్షల కోసం విద్యార్థుల కుటుంబాలు ఏకంగా రూ.1.32 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నాయి. ఇంత సొమ్ము వసూలు చేసి చివరకు ‘పేపర్ లీక్ అయింది’అంటూ లెక్కలతో సహా చెప్పారు .దీని ద్వారా యువతను ఆకర్షించే పనిలో కాంగ్రెస్ పడిపోయింది.








