తెలంగాణ డీజీపీ కార్యాలయంలో షాకింగ్ ఘటన
తెలంగాణ డీజీపీ కార్యాలయం (DGP Office)లో కానిస్టేబుల్ (Constable)గా పనిచేస్తున్న స్వామి (Swami) తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్మకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. రాత్రి విధుల్లో ఉన్న స్వామి ఉదయం 5:30 గంటల సమయంలో వాష్‌రూమ్‌కి వెళ్లి అక్కడే రివాల్వర్‌తో కాల్చుకున్నట్లు గుర్తించారు. బెట్టింగ్ యాప్(Betting app)లకు బానిసై, అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఆత్మహత్మ చేసుకుంటున్నాను. నా భార్య, పిల్లల్ని ఏమీ అనొద్దు. వాళ్లు మంచి వాళ్లు. చనిపోయిన తర్వాత దెయ్యం అయినా సరే వాళ్లను జాగ్రత్తగా చూసుకుంటా అని స్వామి తన డైరీలో రాసుకున్న నోట్‌ను పోలీసులు (Police) గుర్తించారు. ఈ ఏడాది జులై 2 నుంచి డీజీపీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ స్వామి స్వగ్రామం భువనగిరి జిల్లా చౌటుప్పల్.








