“రోమాంచకం” మూవీ ఫస్ట్ సింగిల్ ‘రాధా రమణ’ రిలీజ్
-సెప్టెంబర్ 3న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ
బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తున్న సినిమా “రోమాంచకం”. సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి రూపొందిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన “రోమాంచకం” సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ ఆడియెన్స్ ను అట్రాక్ట్ చేసి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటున్నాయి. ఈ సినిమా సెప్టెంబర్ 3న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
ఈ రోజు “రోమాంచకం” సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘రాధా రమణ’ రిలీజ్ చేశారు. ఈ పాటకు ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ అందమైన సాహిత్యాన్ని అందించగా…మ్యూజిక్ డైరెక్టర్ వాసుకి వైభవ్ మెమొరబుల్ ట్యూన్ తో కంపోజ్ చేసి శ్రావ్యంగా పాడారు. హీరో హీరోయిన్స్ మధ్య బ్యూటిఫుల్ పొయెటిక్ రొమాంటిక్ మేకింగ్ తో ఈ పాటను చిత్రీకరించారు. ‘రాధా రమణ’ పాట ఎలా ఉందో చూస్తే – ‘రాధా రమణ రాగాలు మనసున మోగే వేళలో..ఏదో తపన తాగేసి వయసులు ఊగే వేళలో..ఓ కన్నా నీ అందమే..అలలై అలలై ముంచే, కన్నుల్లో అందుకే కలలే కథలే పెంచే, ఆవేశమే తెరచాటుగా లాగగా, బిడియాల ఆదేశమే పొరపాటనీ ఆపగా, ఈ ఊగిసలో, ఊయలలో, ఉందనా లేదనా..’ అని సాగుతూ ఈ పాట ఆకట్టుకుంటోంది.
“రోమాంచకం” సినిమా ప్రేమ, హాస్యం, ఉత్కంఠ కలగలిపి ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించేందుకు తెరపైకి రాబోతోంది. ఇంట్రెస్టింగ్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా సెప్టెంబర్ 3వ తేదీ నుంచి ప్రేక్షకుల్ని థియేటర్స్ లో ఎంగేజ్ చేయబోతోందీ మూవీ.








