ఆటా మహాసభల్లో ‘శ్రీ శివ పార్వతుల కళ్యాణం’
అమెరికన్ తెలుగు సంఘం (ఆటా) ఈ ఏడాది నిర్వహించనున్న 19వ కాన్ఫరెన్స్ & యూత్ కన్వెన్షన్లో భాగంగా, చారిత్రక ఆధ్యాత్మిక వేడుకకు సిద్ధమైంది. శ్రీ శివ పార్వతుల కళ్యాణాన్ని అత్యంత వైభవంగా, సంప్రదాయబద్ధంగా నిర్వహించేందుకు ఆధ్యాత్మిక కమిటీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. భారత్ నుండి ప్రత్యేకంగా తీసుకువచ్చిన ఉత్సవ మూర్తుల సమక్షంలో, శ్రీశైలం దేవస్థానం మార్గదర్శకత్వంలో ఈ దివ్య కళ్యాణం జరగనుంది.
ఆగస్టు 2, 2026న బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో ఉదయం 8:30 నుండి 11:30 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ వేడుకలో పాల్గొని, శివ పార్వతుల ఆశీస్సులు పొందాలని ఆటా ఆధ్యాత్మిక కమిటీ తెలుగు వారందరికీ పిలుపునిచ్చింది.








