23rd July 2026

_________

- Saidulu

ఇంటి దేవ మూలను (ఈశాన్యం) ఆకర్షణీయంగా డెకరేట్ చేసే ఐడియాస్...

ఈశాన్యంలో చిన్న పూజా మండపం లేదా ధ్యాన ప్రదేశం ఏర్పాటు చేయడం శ్రేయస్కరం. మార్నింగ్ వైబ్స్ పెంచి మనస్సుకు ఎంతో శాంతిని ఇస్తుంది.

పూజా లేదా ధ్యాన ప్రదేశం

ఈశాన్యంలో తులసి, స్నేక్ ప్లాంట్ లేదా పీస్ లిల్లీ వంటి చిన్న ఇండోర్ మొక్కలను ఉంచండి. ఇవి ఇల్లు ప్రశాంతంగా, అందంగా ఉండేలా చేస్తాయి.

పవిత్రమైన ఇండోర్ మొక్కలు

వాస్తు ప్రకారం ఈశాన్యం జల మూలకం. అక్కడ చిన్న వాటర్ ఫౌంటెన్ లేదా అక్వేరియం అమర్చడం వల్ల ఇంట్లోకి ఐశ్వర్యం, శాంతి లభిస్తాయి.

ప్రవహించే నీటి ఫౌంటెన్

ఈశాన్య గోడలకు లేత నీలం, క్రీమ్ లేదా లేత పసుపు రంగులు వేయండి. ఇవి వెలుతురును పెంచి, ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి.

తేలికపాటి లేత రంగులు

ఈ మూలలో చీకటి ఉండకూడదు. ఒక చిన్న ఫ్లోర్ ల్యాంప్ లేదా వార్మ్ టేబుల్ ల్యాంప్ అరేంజ్ చేస్తే ఆ కార్నర్ ఎంతో ఆకర్షణీయంగా మారుతుంది.

 సున్నితమైన లైటింగ్

బుద్ధుని విగ్రహం, జలపాతం లేదా ప్రశాంతమైన ప్రకృతి పెయింటింగ్స్ ఈశాన్య గోడపై అమర్చితే ఇంటికి కళాత్మక రూపం చేకూరుతుంది.

ఆధ్యాత్మిక చిత్రాలు & ఆర్ట్

ఈశాన్య కార్నర్‌లో స్ఫటికాలు (Crystals) లేదా వాస్తు పిరమిడ్ ఉంచడం వల్ల చెడు శక్తులు తొలగి, సానుకూల శక్తి ప్రసరిస్తుంది.

క్రిస్టల్స్ & వాస్తు పిరమిడ్లు

ఈశాన్యం ఎప్పుడూ తేలికగా, శుభ్రంగా ఉండాలి. బరువైన బీరువాలు, చెత్తకుండీలు ఇక్కడ పెట్టకుండా ఖాళీగా, ప్రశాంతంగా ఉంచండి.

బరువైన ఫర్నిచర్ లేకుండా క్లీన్‌గా

ఈశాన్య మూలలో అరోమా డిఫ్యూజర్ లేదా సువాసన దివ్యమైన అగరబత్తులు వాడండి. ఇది ఇంటి వాతావరణాన్ని రోజంతా ఆహ్లాదకరంగా ఉంచుతుంది.

సువాసనలు & అరోమా డిఫ్యూజర్లు