తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం శుభవార్త
తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో అదనంగా ధాన్యం కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం (Central Government) గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రబీకి సంబంధించి అదనంగా 8 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలుకు ఆమోదం తెలిపింది. సవరించిన అంచనాల ప్రకారం సేకరణ మొత్తం 35 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 43 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలుకు నిర్ణయించింది. ధాన్యం కొనుగోళ్లు పెంచినందుకు ప్రధాని మోదీ ( Modi), కేంద్రమంత్రి ప్రహ్లాద్‌జోషి (Pralhad Joshi)కి రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి (Kishan Reddy), బండి సంజయ్ (Bandi Sanjay) ధన్యవాదాలు తెలిపారు.








