ఆటా అవార్డు గ్రహీతలు వీరే….
అమెరికా తెలుగు సంఘం (ఆటా) 19వ మహాసభలను పురస్కరించుకుని వివిధ రంగాల్లో ప్రతిభను చూపిన పలువురు ప్రముఖులకు ఆటా అవార్డులను జులై 31 నుండి ఆగస్టు 2 తేదీల్లో బాల్టిమోర్ లో జరిగే మహాసభల్లో అందజేయనున్నారు. సమాజ సేవ, విజ్ఞాన సాంకేతికత, కళలు, వైద్యం, వ్యాపారం, క్రీడలు మరియు యువజన విభాగాలలో ప్రతిభ కనబరిచిన పలువురు ప్రముఖులు ఈ అవార్డులకు ఎంపికయ్యారు.
ఆటా అవార్డు గ్రహీతలు
కమ్యూనిటీ అండ్ హ్యుమానిటేరియన్ విభాగంలో కిరణ్ చుక్కపల్లి, శశి గుండాలకు అవార్డులను అందజేయనున్నారు.
సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో డా. రవీందర్ రేగట్టె, డా. రామమోహనరెడ్డి అప్పన్నగారికి
పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ విభాగంలో సుధీర్ రావు, రఘునందన్ నల్లాన్ చక్రవర్తుల, అశోక్ చింతకుంట అండ్ మాధవి సోలేటి. అక్షర దేవులకు
బిజినెస్ ఎక్సలెన్స్ విభాగంలో గౌతమ్ అమర్నేని, రామ్ మట్టపల్లికి
యూత్ ఆచీవ్ మెంట్ అవార్డును ఈషా నాగిరెడ్డికి,
మెడిసిన్ అండ్ రైజింగ్ స్టార్ విభాగంలో డా. రమ్య చిత్రంగదకు అవార్డులను బహూకరించనున్నారు.
వాలంటీర్ సర్వీస్ అవార్డుకు సంబంధించి బాలా రెడ్డి ఇందుర్తికి, డా. వందన దేవలపల్లి, యెన్నం శ్రీనివాస్ రెడ్డికి
ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ / లీడర్షిప్ కు సంబంధించి నరసింహారెడ్డి కొప్పులకు,
జర్నలిజం రంగానికి సంబంధించి రవికాంత్ రెడ్డి రామసయం,
స్పోర్ట్స్ అండ్ యూత్‌కు సంబంధించి నితీష్ రెడ్డి సుధిని (స్పోర్ట్స్), సాయి తేజ రెడ్డి ముక్కామల్ల (స్పోర్ట్స్) ఏషా నాగిరెడ్డికి ఇవ్వనున్నారు.
ఈ అవార్డులను వివరాలు అవార్డుల కమిటీ చైర్ సంతోష్ రెడ్డి, హను తిరుమల్ (కో-చైర్) తెలియజేశారు. ఆటా అవార్డు గ్రహీతలకు ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా, కన్వీనర్ శ్రీధర్ బనాలా, రవి చల్లా (కోఆర్డినేటర్) అభినందనలు తెలియజేశారు.








