మాధవ్, మంచాల నాగరాజ్ ‘మారెమ్మ’ సెప్టెంబర్ 10న రిలీజ్
మాస్ మహారాజా రవితేజ సోదరుడి తనయుడు, నటుడు రఘు కుమారుడు మాధవ్ విలేజ్ యాక్షన్-డ్రామా ‘మారెమ్మ’తో హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్ర నిర్మాతలు సినిమా థియేట్రికల్ రిలీజ్ డేట్ ని ఖరారు చేశారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 10, 2026న థియేటర్లలో విడుదల కానుందని ప్రకటించారు.
కొత్తగా విడుదలైన పోస్టర్లో మాధవ్ యుద్ధంలో పోరాడి వచ్చినట్టుగా ఇంటెన్స్ అవతార్‌లో ఆకట్టుకుంటున్నారు. ఈ పోస్టర్లో ఆయన పాత్రలోని రా ఇంటెన్సిటీతో పాటు భావోద్వేగాలను బలంగా చూపించారు. హీరోకు, పవిత్రమైన ఆవుకు మధ్య కనిపించే పేస్ అఫ్, ఈ సినిమా కథా నేపథ్యాన్ని ఆసక్తికరంగా ప్రజెంట్ చేస్తోంది.
మారెమ్మ చిత్రంతో మంచాల నాగరాజ్ దర్శకుడిగా పరిచయం అవుతుండగా, మోక్ష ఆర్ట్స్ సంస్థ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తోంది. మయూర్ రెడ్డి బండారు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, పాటలు, ఇటీవల విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌తో గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచడంలో మేకర్స్ విజయవంతమయ్యారు.
గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘మారెమ్మ’ స్థానిక సంస్కృతి, సంప్రదాయాలు, బలమైన భావోద్వేగాలతో మేళవించిన యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. మాధవ్ తన నటనకు పూర్తి స్థాయిలో అవకాశం ఉన్న పాత్రలో, యాక్షన్‌తో పాటు హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలను ఆవిష్కరించనున్నారు.
ఈ చిత్రంలో దీపా బాలు కథానాయికగా నటిస్తున్నారు. ప్రశాంత్ ఆర్. విహారి సంగీతం అందిస్తుండగా, ప్రశాంత్ అంకిరెడ్డి సినిమాటోగ్రఫీ, దేవ్ రాథోడ్ ఎడిటింగ్, రాజ్‌కుమార్ మురుగేసన్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.
థియేట్రికల్ రిలీజ్‌ను అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో ‘మారెమ్మ’ ప్రమోషనల్ కార్యక్రమాలను మరింత వేగవంతం చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు.








