22nd July 2026

_________

- Saidulu

గుడి ప్రసాదం రుచిని గుర్తుచేసే రవ్వ కేసరి... ఇంట్లోనే ఇలా చేద్దామా!

పండుగైనా, పూజైనా మన ఇంట్లో గుర్తొచ్చే మొదటి స్వీట్ రవ్వ కేసరి! గుడిలో ఇచ్చే ప్రసాదంలా సాఫ్ట్‌గా చేసే సీక్రెట్ రెసిపీ ఇదిగోండి!

1 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు పంచదార, 1/2 కప్పు నెయ్యి, 3 కప్పుల నీళ్లు! ఈ కొలతలు పాటిస్తే కేసరి గట్టిపడకుండా దూదిలా ఉంటుంది.

పక్కా కొలతలే సీక్రెట్

పాన్‌లో 2 స్పూన్ల నెయ్యి వేసి జీడిపప్పు, కిస్‌మిస్‌లను బంగారు రంగు వచ్చేవరకు దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి.

డ్రై ఫ్రూట్స్ వేయించడం

అదే నెయ్యిలో బొంబాయి రవ్వ వేసి సన్నని మంటపై మంచి సువాసన వచ్చేవరకు వేయించాలి. రవ్వ మాడకుండా జాగ్రత్తపడాలి.

రవ్వ వేయించడం

వేరొక గిన్నెలో 3 కప్పుల నీళ్లు పోసి బాగా మరిగించాలి. ఇందులో చిటికెడు కుంకుమపువ్వు లేదా ఆరెంజ్ కలర్ వేయాలి.

నీళ్లు మరిగించడం

మరుగుతున్న నీళ్లను వేయించిన రవ్వలో పోస్తూ, ఉండలు కట్టకుండా గరిటెతో బాగా కలుపుతూ ఉడికించుకోవాలి.

ఉండలు లేకుండా కలపడం

రవ్వ బాగా ఉడికి దగ్గర పడ్డాక పంచదార వేయాలి. పంచదార కరిగి మిశ్రమం మళ్లీ జారుగా, మెరుస్తూ మారుతుంది.

పంచదార వేసే సమయం

ఇప్పుడు మిగిలిన నెయ్యి, యాలుకల పొడి వేసి బాగా కలపాలి. నెయ్యి కేసరి నుండి వేరుపడే వరకు మగ్గనివ్వాలి.

నెయ్యి, యాలుకల సువాసన

చివరగా వేయించిన జీడిపప్పు, కిస్‌మిస్ చల్లుకుంటే నోరూరించే టెంపుల్ స్టైల్ రవ్వ కేసరి సిద్ధం! వేడిగా వడ్డించండి.