బ్రిటిష్ పార్లమెంట్లో లార్డ్ ఉదయ్ నాగరాజును కలిసిన గణేష్ బిగాల, మహేష్ బిగాల
యూరప్ పర్యటనలో భాగంగా లండన్ వెళ్లిన ఎన్నారై బీఆర్ఎస్ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల , నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాలకు ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా లండన్ చేరుకున్న మహేష్ బిగాల పార్టీ సభ్యత్వ నమోదు, ఎన్నారై శాఖల బలోపేతం , సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంపై దిశానిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎన్నారై బీఆర్ఎస్ అధ్యక్షులు నవీన్ రెడ్డి, ఉపాధ్యక్షులు హరి గౌడ్ నవాబుపేట్, సత్య మూర్తి చిలుముల, సతీష్ రెడ్డి గొట్టిముక్కుల, మాజీ అధ్యక్షులు అశోక్ గౌడ్ దూసరి, జనరల్ సెక్రటరీ రత్నాకర్ కడుదుల, ఐటీ & మీడియా కార్యదర్శి రవి ప్రదీప్ పులుసు, కోశాధికారి సురేష్ బుడగం తదితరులు పాల్గొన్నారు.
ఈ పర్యటనలో భాగంగా మహేష్ బిగాల, గణేష్ బిగాలతో పాటు బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి , ఇతర ముఖ్య నాయకులు బ్రిటిష్ పార్లమెంట్లో ఇటీవల ‘లార్డ్’ (Lord) హోదా దక్కించుకున్న ప్రముఖులు ఉదయ్ నాగరాజును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు , అభినందనలు తెలియజేశారు. తెలుగు వారి నుంచి బ్రిటిష్ పార్లమెంట్లో ఈ అరుదైన గౌరవం దక్కించుకోవడం అత్యంత ఆనందకరమని, ఇది తెలుగు వారందరికీ గర్వకారణమని వారు కొనియాడారు. ఈ సమావేశంలో బిఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి తదితరులు కూడా పాల్గొన్నారు.








