TTA మెగా కన్వెన్షన్ – మెగా సక్సెస్ మీద మినీ విశ్లేషణ !
గత మూడు రోజులుగా షార్లెట్ నగరంలో జరిగిన టిటిఏ మెగా కన్వెన్షన్ కి 31000 కి మించి పాల్గొన్నారు అని అనౌన్స్మెంట్ పోస్టర్ పెట్టారు ఆర్గనైజర్లు. మెగా అని ఏ ధైర్యంతో, ఏ కాన్ఫిడెన్స్ తో అనౌన్స్ చేశారో గాని ఆ పని ని చేసి చూపించారు… ఈ కన్వెన్షన్ లో హైలైట్స్ వాటి వార్తలు, విశేషాలు, ఫోటోలు అన్నీ అన్నిచోట్ల వచ్చేసాయి.. అందరు చూసేశారు.. చదివేశారు .. కాబట్టి వాటిని పక్కన పెట్టి ఈ కన్వెన్షన్ ఇంత విజయవంతం కావటానికి కారణాలు ఏమిటి? అన్న విషయాల ఒక మీద చిన్న విశ్లేషణ చేద్దాం..
అగ్రనాయకత్వం…
టి టి ఏ అనగానే మొదటగా గుర్తొచ్చే పేరు ఆ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి గారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించగానే అమెరికాలో కూడా తెలంగాణ వాసులకు ఒక వేదిక ఉండాలి అని, తెలంగాణ సాంస్కృతి అమెరికాలో కూడా పొందుపరచాలని,వెల్లివిరవాలనే కోరికతో 2015 లో డాక్టర్ మల్లారెడ్డి గారు వ్యవస్థాపకులుగా మరికొందరతో కలిసి స్థాపించిన సంస్థ ఇది. కేవలం 10 సంవత్సరాల్లో ఎప్పటినుంచో ఉంటూ, అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్న పెద్ద తెలుగు సంఘాల లిస్టులో ఒకటిగా చేరింది. ఒక సంస్థ ఇమేజ్ పరంగా… అభిమానుల సంఖ్య పరంగా.. సభ్యుల సంఖ్య పరంగా ఇంత వేగంగా అభివృద్ధి చెందింది అంటే చాలా గొప్ప విషయం.
షార్లెట్ లో ప్రారంభమైన రోజు నుంచి బ్యాంఖ్యేట్ డిన్నర్ గాని, ఇనాగురల్ ప్రోగ్రామ్ గాని, మొదటి రోజు- రెండో రోజు ప్రైమ్ టైమ్ ఈవెంట్స్ గాని పరిశీలిస్తే ఫౌండర్ డాక్టర్ మల్లారెడ్డి గారు, అడ్వై జరీ చైర్ శ్రీ విజయపాల్ రెడ్డి, కో చైర్ శ్రీ మోహన్ పాటలోల్ల, మెంబర్లు శ్రీ భరత్ మాదాడి, శ్రీ వంశీ రెడ్డి, టిటిఏ ప్రెసిడెంట్ శ్రీ నవీన్ రెడ్డి మలిపెద్ది, కాన్ఫరెన్స్ కన్వీనర్ శ్రీ ప్రవీణ్ చింత పేర్లు వినిపిస్తూనే ఉన్నాయి. మూడు రోజుల కాన్ఫరెన్స్ లో ఈ అగ్రనాయకత్వంలో ఉన్న ఈ ఏడుగురు దాదాపు 100 సార్లు స్టేజ్ మీదకి వెళ్లి ఉంటారు. ఫౌండర్ గా శ్రీ మల్లారెడ్డి మాట్లాడేటప్పుడు మిగతా అందరి పేర్లన్నీ ఉదాహరిస్తూ వారు చేసిన పనులు చెప్తారు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా వారు మాట్లాడే సమయంలో మిగతా వాళ్ళ పేర్లు చెబుతూ వారి నుంచి వచ్చిన గైడెన్స్ – కోఆపరేషన్- సపోర్ట్ గుర్తు చేసుకుంటారు. అనేకసార్లు లేదా అన్నిసార్లు అవే మాటలు విన్నా కూడా మనకి బోరు కొట్టదు- రేపెటిషన్ అనిపించదు ఎందుకంటే ఆ మాటల్లో స్వచ్ఛమైన ప్రేమ- ఆప్యాయత – గౌరవం కనిపిస్తుంది. వాళ్ల ధోరణిలో ఐక్యత- స్నేహభావం- సంఘీభావం కనిపిస్తుంది
డెమోక్రసీ పేరుతో ఇతర తెలుగు సంఘాల నాయకత్వంలో జరుగుతున్న అవకతవకలు, మీటింగ్ లు కూడా జరపలేని అవస్థలు చూస్తున్న తెలుగు కమ్యూనిటీ కి టీటీఏ అగ్రనాయకత్వంలో ఇంతటి ఐక్యత సంఘీభావం చూస్తే గౌరవం కలగటం సహజం. ఈ రోజులలో ఏంతో పేరు – ప్రతిష్ట ఉన్న జాతీయ తెలుగు సంఘాల్లో లేదా సిటీ బేస్డ్ తెలుగు సంఘాల్లో కూడా ప్రెసిడెంట్ కి- కాబోయే ప్రెసిడెంట్ కి – లేదా ఇప్పుడున్న ప్రెసిడెంట్ కి – క్రితం సంవత్సరం ప్రెసిడెంట్ కి మాటలు లేని పరిస్థితుల్లో ఉన్న మనం టిటిఎలో గత ఆ 6-7 సంవత్సరాల చరిత్ర తిరగవేస్తే ప్రెసిడెంట్ పదవి నుంచి క్రమశిక్షణతో బాధ్యతలు నిర్వహించిన అందరూ కూడా పదోన్నతి పొంది అడ్వైజరీ కౌన్సిల్ లోకి వెళ్తున్నారు ఎంత చక్కని పద్దతి ఇది. ఎంత చక్కని ఆలోచన ఇది. మిగతా సంఘాలు కూడా ఇంత ఆదర్శగా ఉంటే బాగుంటుంది కదా!
సంస్థ ని ఈ విధంగా తీర్చి దిద్దుతున్న ఫౌండర్ డా. మల్లారెడ్డి గారికి, అంతే స్ఫూర్తి తో ప్రెసిడెంట్ గా – ఆపైన అడ్వైజరీ కౌన్సిల్ మెంబెర్ గా చేరిపోతున్న ఇతర నాయకులకు అభినందనలు.
షార్లెట్ నగరం
ఒక సంస్థ చిన్నదైనా పెద్దదైనా , కొత్తదైనా పాతదైనా ఒక కార్యక్రమం తలపెట్టినప్పుడు ఒక ఇమేజేనేషన్ తో చేయబోయే పని, దానికి అయ్యే ఖర్చు ఊహించుకుని మొదలు పెడతారు. అలాగే 20 24 లో సియాటెల్ నగరంలో కాన్ఫరెన్స్ జరిపి విజయవంత చేసిన అనుభవం తో ఈ సారి కూడా 2026 లో జరిగే కన్వెన్షన్ షార్లెట్ నగరం ను వేదిక చేయడం ఒక మంచి వ్యూహాత్మక నిర్ణయం అని చెప్పాలి. టీ టీ ఏ ప్రెసిడెంట్ శ్రీ నవీన్ రెడ్డి మల్లిపెద్ది షార్లెట్ లో నివసించడమే కాకుండా , షార్లెట్ చాలా వేగం గా అభివృద్ధి అవుతున్న నగరం అని, గత 10 సంవత్సరాలలో షార్లెట్ కూడా బాగా అభివృద్ధి చెందుతోందని, నాయకత్వాన్ని ఒప్పించడం లో విజయం పొందారు. శ్రీ నవీన్ రెడ్డి మల్లిపెద్ది షార్లెట్ నగరం లో తెలుగు కమ్మూనిటీ పెరుగుతోంది షార్లెట్ నగరం కూడా తెలుగు కార్యక్రమాలకు ఒక ప్రధాన నగరం అయ్యే అవకాశం ఉంది అని గుర్తించడం, అగ్ర నాయకత్వం వప్పుకోవాదం తో ఈ రోజు షార్లెట్ 30000 కు పైగా తెలుగు వారు పాల్గొన్న కన్వెన్షన్ కి వేదిక గా నిలిచింది. కొత్త ప్లేస్ అవడం వలన కాన్ఫరెన్స్ లో పని చేయడానికి అనేక మంది యువ నాయకులను తీసుకురాగలిగారు. అలాగే మొదటి సారి జరిగే కార్యక్రమం అవడం వలన ఆడియన్స్ కూడా బాగా వచ్చారు.
విరాళాలు
ఈ కన్వెన్షన్ మొదటగా డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి గారు $100000 విరాళం ప్రకటించి పనులు మొదలు పెట్టారు. వెంటనే టిటిఏ ప్రెసిడెంట్ శ్రీ నవీన్ రెడ్డి మల్లిపెద్ది కూడ $ 100000 డాలర్ విరాళం ప్రకటించి తన దీక్షను, పట్టుదలను TTA కె కాకుండా కమ్యూనిటీ కి తెలిపారు. అదేవిధంగా అగ్ర నాయకత్వంలో ఉన్న ఇతర సభ్యులు శ్రీ విజయ పాల్ రెడ్డి, శ్రీ మోహన్ రెడ్డి పాట లోల్ల , కాన్ఫరెన్స్ కన్వీనర్ శ్రీ ప్రవీణ్ చింత, కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ శ్రీ నరేంద్ర దేవరపల్లి కూడా $ 50000 విరాళాలు ప్రకటించి తమ సంఘీభావం తెలిపారు. ఈ విధంగా అగ్ర నాయకత్వం దాదాపు రెండు సంవత్సరాలు తమ సమయం ఇవ్వడమే కాకుండా ఈ విధంగా విరాళాలు ప్రకటించి అందరికి స్ఫూర్తిగా నిలిచారు అందువలన ఈ కన్వెన్షన్ కి స్పాన్సర్లు, డోనార్ల ను తీసుకు రాగలిగారు. $100000 ఇచ్చినవారు ముగ్గురు, $ 50000 ఇచ్చినవారు 15 మంది, $ 25000, $ 10000 $ 5000 ఇచ్చినవారు దాదాపు 200 మంది పైగా ఉన్నారు అని తెలిసింది. టి టి ఏ సంస్థ తెలంగాణ సంస్థగా ఉన్నా , ఆంధ్ర ప్రదేశ్ వారితో గాని ఇతర తెలుగు సంఘాలతో గాని తమ స్నేహభావాన్ని ఏ నాడు వీడలేదు అందువల్లనే ఈరోజు టీ టీ ఏ వచ్చిన డోనర్స్ లో అనేకమంది తానావారు ఆటా వారు, నాట్స్ వారు కూడా ఉన్నారు అని తెలుస్తోంది.
ఈవెంట్ మేనేజ్మెంట్
ప్రతి సంస్థకి ప్రతిసారి కాన్ఫరెన్స్ ఒక్కో నగరంలో చేయాల్సి రావటం ప్రతిసారి కూడా కొత్త నాయకత్వం రావటం వలన ఏర్పడిన కొత్త ఐడియాలు ఒక విధంగా మంచిదే కానీ అనుభవం లేకపోవడం ఒకవిధమైన లోటే. దాదాపు ప్రతి తెలుగు సంఘానికి, ప్రతి కాన్ఫరెన్స్ కి ఇంతకు జరిగిన కాన్ఫరెన్స్ లో జరిగిన లోటుపాట్లను తెలుసుకొని సరి దిద్దే అవకాశం ఉండదు. కానీ ఇక్కడ అధినాయకత్వం స్టడీగా ఉండటం చేసిన తప్పులు చేయకుండా కొత్త మార్గాలు అన్వేషిస్తూ ముందుకు సాగటం జరిగింది. చేయాల్సిన కార్యక్రమం దానికి అయ్యే ఖర్చు, ఖర్చు చేయ గలిగే స్తొమత మీద ముందుగానే స్పష్టత ఉండటం వలన నిర్ణయాలు సకాలం లో తీసుకోవడం కూడా జరిగింది.
అన్నింటికీ మించిన విజయ రహస్యం: షార్లెట్‌లో ఎంట్రీ ఫ్రీ చేయటం అనే నిర్ణయం. మాములుగా ప్రతి తెలుగు సంఘం తమ తమ కాన్ఫరెన్స్ లకు మూడు రోజులు ( ఐదు పూటలు ) వేల సంఖ్య లో కాంఫర్నెస్ కి టికెట్ కొని వచ్చే ప్రేక్షకులు – వారి కోసం బ్రేక్ ఫాస్ట్ – లంచ్, డిన్నర్ ఏర్పాట్లు, వాటికోసం డైనింగ్ హాల్ ఏర్పాట్లు, తదితర ఖర్చులతో సతమతమవుతూ ఉంటుంది. కాంఫర్నెస్ లో అదే సవాలు తో కూడిన పని. కాన్ఫరెన్స్ కి మంచి పేరు, లేదా త్రుటిలో చెడ్డ పేరు తెచ్చే అంశం. ఇప్పుడు టీ టీ ఏ వారు ఎంట్రీ – ఉచితం అని ప్రకటించగానే అభిమానులు కావలసిన కార్యక్రమాలు చూడటం కోసం, తమ అభిమాన సినీ నటులను సంగీత విభావాలను చూడటం కోసం వేల సంఖ్యలో రావడం జరిగింది. కాన్ఫరెన్స్ వెన్యూ లో అనేక రెస్టారంట్ వారికి ఫుడ్ దొరికే ఏర్పాట్లు చేశారు. ఆ విధంగా వేల సంఖ్యలో తెలుగు వారు కన్ఫెరెన్స్ కి వచ్చారు. తమకు కావలిసిన ఫుడ్ కొని తిన్నారు. ప్రోగ్రాం లను ఎంజాయ్ చేశారు. ఇది ఒక విధంగా అమెరికాలో జరిగే తెలుగు కాన్ఫరెన్స్‌లలో ఇది ఒక బోల్డ్ స్టెప్ కింద లెక్క.
చివరగా ..
ఎంట్రీ ఫ్రీ నిర్ణయం మంచి ఫలితాన్ని ఇచ్చింది కాబట్టి ఇతర తెలుగు సంఘాలు కూడా అనుసరించ వచ్చు. కొన్నాళ్ళకి ఇదే అన్ని చోట్ల అనే పరిస్థితి రావొచ్చు. కానీ విరాళాలు సేకరించే కార్యక్రమం, వాటిని సరి అయిన సమయం లో తెచ్చుకొవాలనే ఒత్తిడి సంస్థ నాయకులకు ఉంటుంది. ఇక్కడ ఆడియన్సు అంటే ఎవరు? దాదాపు సంవత్సరానికి $100000 నుంచి $300000 సంపాదించే ఉద్యోజిస్టులు.. వ్యాపారస్తులు , బెంజ్ కార్లు – టెస్లా కార్లకు ఓనర్లు.. గంటకి $40 + ఫీజు కడుతూ పిల్లల్లకు డాన్స్ క్లాసులకు, స్విమ్మింగ్ కాల్స్ లకు, బాస్కెట్ బాల్ కౌచింగ్ లకు పాపే తల్లి తండ్రులు. వీరంతా తమ తోటి తెలుగు వారు ఏంటో వ్యయ ప్రయాసలతో ప్రోగ్రాం లు చేస్తున్నారు. ఇండియా నుంచి సినీ తారలను , మ్యూజిక్ డైరెక్టర్లలను తెస్తున్నారు .. ఆ ప్రోగ్రాం లను ఫ్రీ గా చూడాలి అని ఆశించకండి. ఫ్రీ ఎంట్రీ ఉన్నా మీకు తోచినంత డొనేషన్ ఆ సంస్థ కు ఇచ్చి ప్రోగ్రాం ని ఎంజాయ్ చేయండి. అప్పుడే మరిన్నిమంచి కార్యక్రమాలు మన ముందుకు వస్తాయి.









