జననాయగన్‌పై అనిల్ క్లారిటీ!
డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil ravipudi) తెరకెక్కించిన భగవంత్ కేసరి(Bhagavanth kesari) కథ ఆధారంగా తమిళంలో రూపొందిన జన నాయగన్(Jana nayagan)పై గత కొంతకాలంగా ఎన్నో డిస్కషన్స్ సాగుతున్నాయి. ముఖ్యంగా ఈ రీమేక్ ప్రక్రియలో అనిల్ రావిపూడి ఎంతవరకు భాగస్వామ్యమయ్యారనే అంశంపై ఆసక్తి నెలకొంది. తాజాగా ఆయన చేసిన కామెంట్స్ తో ఈ డౌట్స్ కు స్పష్టత వచ్చింది.
భగవంత్ కేసరి రిలీజైన తర్వాత విజయ్(Vijay) ఆ సినిమాను చూసి బాగా మెచ్చుకున్నారని అనిల్ రీసెంట్ గా వెల్లడించారు. కథలోని ఎమోషన్ తనను బలంగా ఆకట్టుకోవడంతో తమిళ ప్రేక్షకులకు అనుగుణంగా అదే భావాన్ని కొత్త రూపంలో తీసుకురావాలనే ఆలోచన వ్యక్తం చేసినట్లు చెప్పారు. ఆ తర్వాత డైరెక్టర్ హెచ్. వినోద్(H. Vinod) ఈ ప్రాజెక్ట్‌ను స్వీకరించి, అసలు కథ సారాన్ని కొనసాగిస్తూనే విజయ్ ఇమేజ్‌కు తగ్గట్టుగా స్క్రీన్‌ప్లేలో పలు మార్పులు చేసినట్లు అనిల్ పేర్కొన్నారు.
తాను ఈ తమిళ వెర్షన్ రూపకల్పనలో ఎలాంటి ప్రత్యక్ష పాత్ర పోషించలేదని అనిల్ స్పష్టం చేశారు. విజయ్ వంటి స్టార్ తన సినిమా కథను ఇష్టపడటం డైరెక్టర్‌గా సంతోషకరమైన విషయమని అన్నారు. అలాగే జననాయగన్‌ను యథాతథ రీమేక్‌గా కాకుండా, ముఖ్యంగా రెండో భాగంలో గణనీయమైన మార్పులతో రూపొందించిన అడాప్టేషన్‌గా చూడాలని ప్రేక్షకులకు సూచించారు. విజయ్ రాజకీయాల్లో పూర్తిస్థాయిలో అడుగుపెట్టే ముందు వస్తున్న చివరి సినిమాగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జన నాయగన్‌పై అంచనాలు మరింత పెరిగాయి.








