జననాయగన్ లో పూజా పాత్రకు కత్తెర?
విజయ్(vijay) హీరోగా హెచ్. వినోద్(H. Vinod) దర్శకత్వంలో రూపొందిన జననాయగన్(Jana Nayagan) రిలీజ్ కు రెడీ అవుతున్న వేళ సినిమా ఫైనల్ ఎడిట్‌కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన చర్చ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇందులో హీరోయిన్ గా నటించిన పూజా హెగ్డే(Pooja Hegde) పాత్ర నిడివి మొదట అనుకున్న దానికంటే గణనీయంగా తగ్గినట్లు ప్రచారం జరుగుతోంది. సినిమాలో ఆమె జర్నలిస్ట్ పాత్రలో కనిపించనున్నప్పటికీ, ఎడిటింగ్ దశలో ఆ పాత్రకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు తొలగించబడినట్లు సమాచారం.
సినిమా ప్రధానంగా విజయ్ పాత్ర చుట్టూ తిరిగే రాజకీయ నేపథ్య కథ కావడంతో, కథనం మరింత వేగంగా సాగేందుకు డైరెక్టర్ కొన్ని మార్పులు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. సెకండాఫ్‌లో పేసింగ్‌ను మెరుగుపరచడం, ప్రధాన కథపై దృష్టి నిలుపుకోవడమే ఈ నిర్ణయానికి కారణమని సినీ వర్గాలు చెబుతున్నాయి. అయితే దీనిపై మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం వెలువడలేదు.
బీస్ట్(beast) తర్వాత విజయ్- పూజా హెగ్డే కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా కావడంతో ఆమె క్యారెక్టర్‌పై ఫ్యాన్స్ లో మంచి అంచనాలున్నాయి. ఇదిలా ఉండగా, మమిత బైజు(Mamitha byju), బాబీ డియోల్(bobby deol) ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్(KVN Productions) నిర్మించింది. ఇప్పటికే పలు మార్పులు, అదనపు సన్నివేశాలు, పాటలతో ఫైనల్ వెర్షన్‌ను సిద్ధం చేసిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.








