స్పిరిట్ లో బాలీవుడ్ స్టార్?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(prabhas) నటిస్తున్న స్పిరిట్(Spirit) సినిమాపై మరో కొత్త ప్రచారం సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ డ్రామాలో బాలీవుడ్ స్టార్ కత్రినా కైఫ్(Katrina Kaif) ఓ కీలక పాత్రలో కనిపించే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే హీరోయిన్గా త్రిప్తి డిమ్రీ(Tripti dimri) పేరు అఫీషియల్ గా ఖరారైన నేపథ్యంలో, కత్రినాను మరో ప్రాధాన్యమైన పాత్ర కోసం పరిశీలిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే ఈ విషయంపై నిర్మాతల నుంచి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ వెలువడలేదు.
ఈ వార్త నిజమైతే ప్రభాస్, కత్రినా కైఫ్ తొలిసారి ఒకే సినిమాలో నటించే అవకాశం దక్కినట్లవుతుంది. గతంలో సౌత్ నుంచి పలు ఆఫర్లు వచ్చినప్పటికీ కత్రినా ఎక్కువగా హిందీ సినిమాలకే పరిమితమయ్యారు. దీంతో స్పిరిట్ ఆమెకు మరో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా నిలిచే అవకాశముందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇదిలా ఉండగా, అమెరికాలో జరిగిన తెలంగాణ టాలెంట్ అసోసియేషన్ కార్యక్రమంలో సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ సినిమా షూటింగ్లో దాదాపు 40% పూర్తైందని వెల్లడించారు. ఇందులో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. టీ-సిరీస్(T Series), భద్రకాళి పిక్చర్స్(Badrakali pictures) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను పరిమిత షూటింగ్ రోజుల్లో పూర్తి చేసి, 2027 మార్చిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం టార్గెట్ గా పెట్టుకుంది.








