నిలకడగా నందమూరి బాలకృష్ణ ఆరోగ్యం : ఏఐజీ ఆసుపత్రి
సినిమా షూటింగ్లో గాయపడిన ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రి (AIG Hospital)లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందంటూ ఏఐజీ ఆసుపత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. సినిమా షూటింగ్ (Movie shooting)లో బాలకృష్ణ ఎడమ మోకాలికి గాయమైన విషయం తెలిసిందే. వైద్య పరీక్షల్లో ఎడమ మోకాలి చుట్టూ రక్తస్త్రావం, వాపు ఉండటంతో పాటు కండారాల గాయం అయినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం ఆయనకు సమగ్ర క్లినికల్, డయాగ్నస్టిక్ పరీక్షలు (Diagnostic Tests) నిర్వహిస్తున్నారు. బాలకృష్ణ ఆరోగ్యం నిలకడగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.








