ఆంధ్రులు గర్వపడేలా అమరావతి నిర్మాణం
ఆంధ్రులు గర్వపడేలా రాజధాని అమరావతి (Amaravati)ని నిర్మిస్తున్నామని మంత్రులు తెలిపారు. ఐకానిక్ భవనాలు రైతుల త్యాగఫలితానికి నిదర్శనమన్నారు. జగన్ (Jagan) అమరావతిపై అక్కసు వెళ్లగక్కటం మాని, ఇక్కడ జరుగుతన్న అభివృద్ధిని చూడాలని హితవు పలికారు. నిర్మాణంలో ఉన్న జీఏడీ భవనాలు (GAD Buildings), ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాసాలు, రహదారులను మంత్రులు గొట్టిపాటి రవి, డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి పరిశీలించారు. నిర్మాణ పనులు జరుగుతున్న తీరును సహచర మంత్రులకు మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ (Narayana) వివరించారు.








