ప్రధాని మోదీకి చంద్రబాబు ఆహ్వానం
ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi)తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) భేటీ అయ్యారు. పార్లమెంట్ హౌస్లో ప్రధానితో సీఎం సమావేశమయ్యారు. ఆగస్ట్ 1న జరిగే భోగాపురం విమానాశ్రయ (Bhogapuram Airport) ప్రారంభోత్సవానికి మోదీని చంద్రబాబు ఆహ్వానించారు. ప్రారంభోత్సవానికి వస్తానని ప్రధాని తెలిపారు. ప్రధానిని కలిసిన వారిలో కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు ( Rammohan Naidu), శ్రీనివాసవర్మ, ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయులు, కలిశెట్టి అప్పలనాయుడు ఉన్నారు.








