హైదరాబాద్‌లో మంత్రులు, కాంగ్రెస్ నేతల అరెస్ట్
ఢిల్లీలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi)తో పాటు విపక్ష నేతల అరెస్టుకు నిరసనగా ఏఐసీసీ పిలుపు మేరకు పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ఆధ్వర్యంలో చల్ లోక్‌భవన్ కార్యక్రమం చేపట్టారు. హైదరాబాద్ నెక్లెస్‌రోడ్ నుంచి లోక్‌భవన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పీసీసీ అధ్యక్షుడు, మంత్రులు దామోదర రాజనర్సింహ (Damodara Raja Narasimha), పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivasa Reddy), అజారుద్దీన్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ర్యాలీ లోక్‌భవన్‌కు చేరుకున్న వెంటనే మంత్రులు, కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు.








