‘నిరవల’ మ్యూజిక్ బ్యాండ్ ఆధ్వర్యంలో “పడమటి సంధ్యా రాగం”
అమెరికాలో ప్రతిష్టాత్మక 19వ అటా కాన్ఫరెన్స్ అండ్ యూత్ కన్వెన్షన్ వేడుకల్లో భాగంగా ఆగస్టు 1వ తేదీ రాత్రి 9:00 గంటల నుండి 11:45 గంటల వరకు ప్రఖ్యాత ‘నిరవల’ మ్యూజిక్ బ్యాండ్ ఆధ్వర్యంలో “పడమటి సంధ్యా రాగం” పేరిట తెలుగు సంస్కృతికి అద్దంపట్టే ఒక అద్భుతమైన సినిమాటిక్ మ్యూజికల్ ట్రిబ్యూట్ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. తెలుగు సంగీత ప్రియులను అలరించేలా వైవిధ్య భరితమైన లైవ్ పెర్ఫార్మెన్స్తో ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. కృష్ణన్ గణేశన్, స్వీకర్ అగస్తి, సాగర్ రాంచంద్రుని, వైశాఖ్ మీనన్, ఫలక్ ఛాయా తదితరులు ఈ మÖ్యజిక్ గ్రూపులో ఉన్నారు.
సంగీతంలో సరికొత్త ఆవిష్కరణలతో పాటు ఆత్మను బ్యాలెన్స్ చేయగల ఒక ప్రోగ్రెసివ్ మ్యూజిక్ కలెక్టివ్‌ను ఏర్పాటు చేయాలనే బేస్ గిటారిస్ట్ సాగర్ రామచంద్రుని ఆలోచనల నుండి 2016లో ఈ బ్యాండ్ రూపుదిద్దుకుంది. కాలక్రమేణా, సమాన ఆలోచనలు గల సంగీతకారులు ఇందులో చేరడంతో, నిరవల్ అద్భుతమైన స్టేజ్ ప్రెజెన్స్ మరియు సంగీత లోతు కలిగిన శక్తివంతమైన ఆరుగురు సభ్యుల బ్యాండ్‌గా రూపాంతరం చెందింది.








