వైట్ శారీలో మెస్మరైజ్ చేస్తోన్న ఆషికా
అందానికి అందం, టాలెంట్ కు టాలెంట్ ఉన్న హీరోయిన్ గా ఆషికా రంగనాథ్(Ashika Ranganath) ను టాలీవుడ్ లో మంచి పేరే ఉంది. కళ్యాణ్‌రామ్(Kalyan ram), నాగార్జున(Nagarjuna), రవితేజ(Raviteja) లాంటి స్టార్ల సరసన నటించి తన టాలెంట్ తో ఎంతో మందిని ఆకట్టుకున్న ఆషికాకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగే ఉంది. తాజాగా ఆషికా తన ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫోటోలు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. ఈ ఫోటోల్లో అమ్మడు వైట్ కలర్ శారీలో దేవకన్యలా మెరిసిపోతూ, తన నడుము అందాలు ఎలివేట్ అయ్యేలా పోజులివ్వగా, వాటిని చూసి నెటిజన్లు తెగ లైకులు చేస్తూ వైరల్ చేస్తున్నారు.








