ధనుష్, రాజ్‌కుమార్ పెరియసామి కాంబోలో రూపొందుతోన్న భారీ ప్రాజెక్ట్ ‘ఓం’ .. అక్టోబర్ 16న విడుదలకు సన్నాహాలు
జాతీయ అవార్డు గ్రహీత ధనుష్ ప్రధాన పాత్రలో ‘ఆర్ టేక్ స్టూడియోస్’, ‘వండర్‌బార్ ఫిలిమ్స్’ సంయుక్తంగా #D55 ప్రాజెక్ట్‌ని నిర్మిస్తోంది. ‘అమరన్’ లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ కొత్త చిత్రానికి ‘ఓం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సందర్భంగా..
*’వండర్‌బార్ ఫిలిమ్స్’ ప్రతినిధి శ్రేయస్ మాట్లాడుతూ* .. ‘దర్శకుడు రాజ్ కుమార్ ధనుష్ గారికి నా కృతజ్ఞతలు. మీకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రాలలో ఇది కూడా ఒకటి. నా సినీ ప్రయాణంలో ఇదే అత్యధిక బడ్జెట్ చిత్రమని నేను భావిస్తున్నాను. అంతేకాకుండా, ‘ఆర్ టేక్ స్టూడియోస్’తో కలిసి పనిచేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. తమిళంలో వారికి ఇదే మొదటి చిత్రం. మా జర్నీ ఇలానే కొనసాగుతుందని ఆశిస్తున్నాను. ఈ సినిమా ఖచ్చితంగా అభిమానులు, ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందని నేను భావిస్తున్నాను. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్, ఇతర అప్డేట్స్ అందరినీ అలరిస్తాయని ఆశిస్తున్నాను. ఇది అందరినీ సంతృప్తిపరిచే చిత్రంగా ఉంటుంది. అక్టోబర్ 16న ఈ మూవీని విడుదల చేస్తున్నామ’ని అన్నారు.
*’ఆర్ టేక్ స్టూడియోస్’ ప్రతినిధి శ్రద్ధ మాట్లాడుతూ* .. ‘మాకు ఈ అవకాశం ఇచ్చిన రాజ్‌కుమార్ గారికి, ధనుష్ గారికి థాంక్స్. ఈ జర్నీ నిజంగా ఒక అద్భుతమైన అనుభవం. అక్టోబర్ 16 కోసం నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. మీతో కలిసి పనిచేయడం నాకు చాలా సంతోషాన్నిచ్చింది. ఇది ఒక అద్భుతమైన కలయిక. ఈ చిత్రం అందరినీ అలరిస్తుంది’ అని అన్నారు.
*’ఆర్ టేక్ స్టూడియోస్’ ప్రతినిధి అజ్మత్ మాట్లాడుతూ* ..‘ మమ్మల్ని ఈ ప్రాజెక్ట్‌లో భాగం చేసినందుకు రాజ్ కుమార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ జర్నీలో భాగమవ్వడం ఆనందంగా ఉంది’ అని అన్నారు.
*దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి మాట్లాడుతూ* .. ‘ఈ చిత్రం ‘OM'(ఓం) అనే టైటిల్‌తో ప్రారంభమైంది. టైటిల్ ఎంపిక నుంచి నటీనటుల ఎంపిక వరకు, అలాగే షూటింగ్ మొదటి షెడ్యూల్ వరకు అన్నీ విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ మూవీ టీం ఎంతో కష్టపడుతోంది. సెట్లో వారి కష్టాన్ని చూస్తుంటే.. ఇది ప్రతీ ఒక్కరికీ ఎంతో ముఖ్యమైన ప్రాజెక్ట్ అని అర్థం అవుతోంది. ప్రతి ఒక్కరూ ఒకే విధమైన అంకితభావంతో పనిచేస్తున్నారు. ధనుష్ గారు, శ్రేయస్, ఇందులో నటిస్తున్న ఇతర నటీనటులందరూ ఎంతో అంకితభావంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ముఖ్యంగా మమ్ముట్టి గారు, సాయి పల్లవి, శ్రీలీల, ఇంద్రన్ గారు, అనేకమంది ప్రతిభావంతులైన నటులు ఈ చిత్రంలో భాగమయ్యారు. అందరి కృషి ఫలితంగా ఈ చిత్రం అద్భుతంగా రూపుదిద్దుకుంటోంది.
ఈ చిత్రం కోసం ఒక భారీ సాంకేతిక బృందం పనిచేస్తోంది. సినిమాటోగ్రాఫర్, కెమెరా సిబ్బంది, సాంకేతిక నిపుణులందరూ అద్భుతంగా సహకరిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ ఎళిలరసు అద్భుతమైన పనితీరును కనబరిచారు. ‘అమరన్’, ‘కరుప్పు’ ప్రాజెక్టులకు పనిచేసిన కలైవనన్ ఈ చిత్రానికి కూడా ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ టైటిల్ అనౌన్స్మెంట్ వీడియోను ఎడిట్ చేసింది కూడా ఆయనే. ఈ వీడియోను కేవలం ఒక టైటిల్ అనౌన్స్మెంట్ వీడియోగా మాత్రమే చూడకూడదు. కేవలం ఒక పోస్టర్‌ను విడుదల చేయడానికి బదులుగా, ధనుష్ గారు పోషిస్తున్న పాత్రను ప్రేక్షకులకు మొట్టమొదటిసారిగా పరిచయం చేసే ప్రయత్నంగా మేము దీనిని రూపొందించాము. రాబోయే రోజుల్లో ఈ చిత్రానికి సంబంధించిన టీజర్, ప్రధాన పాత్రల పరిచయ టీజర్లు, ప్రధాన ట్రైలర్ విడుదల కానున్నాయి.
అక్టోబర్ 16న ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి ‘OM: Chapter 1’ అని పేరు పెట్టాము. ఇది కేవలం ఆధ్యాత్మికమైన శీర్షిక మాత్రమే కాదు, అనేక అర్థాలను ఇమిడ్చుకున్న ఒక ప్రత్యేకమైన టైటిల్ ఇది. ఇందులో ఎన్నో ఆసక్తికరమైన అంశాలు, వివిధ కోణాలు దాగి ఉన్నాయి. ప్రేక్షకులు వాటిని క్రమంగా అర్థం చేసుకుంటారని నేను నమ్ముతున్నాను. అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు’ అని అన్నారు.
*’డివో మ్యూజిక్’ ప్రతినిధి విషు మాట్లాడుతూ* .. ‘ఈ ప్రయాణంలో భాగం కావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ ప్రాజెక్ట్ మొదలైనప్పటి నుండి ప్రతి దశలోనూ మాకు సపోర్ట్ చేస్తూ, మమ్మల్ని నమ్మకానికి అందరికీ కృతజ్ఞతలు. ధనుష్ గారు నటించే ఏ చిత్రంతోనైనా అనుబంధం కలిగి ఉండటం ఎప్పుడూ గర్వకారణమే. దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామి గారి ‘అమరన్’ చిత్రం ఘనవిజయం సాధించింది. ఇప్పుడు ధనుష్ గారు, రాజ్ కుమార్ గారి కలయికలో రూపొందుతున్న ఈ చిత్రంతో మాకు అనుబంధం ఏర్పడటం ఆనందంగా ఉంది. ‘ఓం’ చిత్రం ఖచ్చితంగా భారీ బ్లాక్‌బస్టర్ అవుతుందని నా ప్రగాఢ విశ్వాసం’ అని అన్నారు.
*వార్నర్ మ్యూజిక్ గ్రూప్ – ఇండియా ప్రతినిధ జై మెహతా మాట్లాడుతూ* .. ‘మా ఈ అత్యంత ప్రతిష్టాత్మక ప్రయాణం నేడు ఇంతటి భారీ స్థాయికి చేరుకోవడం ఆనందంగా ఉంది. ఈ ఆనందాన్ని నేను మాటల్లో వర్ణించలేను. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అంశం ఎంతో ప్రత్యేకమైంది. దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి గారు అద్బుతమైన టాలెంట్ ఉన్న వ్యక్తి. ధనుష్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. ‘కాదల్ కొండేన్’ నుంచి ఆయన అంచలెంచలుగా ఎదుగుతూనే వస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో శ్రీలీల, సాయి పల్లవి, మమ్ముట్టి వంటి అద్భుతమైన తారాగాణం ఉంది. ఈ సినిమా భారీ బ్లాక్‌బస్టర్ కావడానికి అవసరమైన అన్ని అంశాలను కలిగి ఉంది. ఇది భారతదేశంలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో కూడా ఘనవిజయం సాధించడానికి అన్ని అర్హతలు కలిగి ఉందని నేను ధృడంగా నమ్ముతున్నాను. నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం ఇది కోలీవుడ్ హిస్టరీలోనే అతిపెద్ద చిత్రాలలో ఒకటిగా నిలవడమే కాకుండా, ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక మైలురాయిగా మారుతుంది’ అని అన్నారు.
ఈ చిత్రంలో ధనుష్ సరసన సాయి పల్లవి, శ్రీలీల కథానాయికలుగా నటిస్తున్నారు. కీలక పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఉండటం ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.
‘అమరన్’ చిత్రం ద్వారా దేశవ్యాప్త గుర్తింపు పొందిన దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి, ఈసారి ప్రేక్షకులను కట్టిపడేసే వినూత్నమైన స్క్రీన్‌ప్లేతో ఒక భారీ యాక్షన్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ధనుష్, రాజ్‌కుమార్ పెరియసామిల కలయికలో వస్తున్న మొదటి చిత్రం ఇదే కావడం విశేషం. ఈ కాంబినేషన్‌కు అభిమానుల నుండి ఇప్పటికే అద్భుతమైన స్పందన లభించింది.
మ్యూజికల్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. షూటింగ్ మొదటి షెడ్యూల్ ఇప్పటికే పూర్తవగా, తదుపరి నిర్మాణ దశల పనులు వేగంగా సాగుతున్నాయి.
‘ఓం’ (OM) అనే టైటిల్ అధికారికంగా ప్రకటించబడటంతో, అభిమానులు ఈ చిత్రం తదుపరి అప్డేట్స్, షూటింగ్ వివరాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ధనుష్, సాయి పల్లవి, శ్రీలీల, మమ్ముట్టి వంటి వారి భారీ తారాగణంతో రాజ్‌కుమార్ పెరియసామి రూపొందిస్తున్న ఈ చిత్రం కోలీవుడ్ ఇండస్ట్రీలోని క్రేజీ ప్రాజెక్ట్‌లలో ఒకటిగా నిలుస్తుంది.
ఈ చిత్రం అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.








