RC17 సినిమాకు స్క్రిప్ట్ లాక్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(ram charan), స్టార్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) కాంబినేషన్లో తెరకెక్కనున్న RC17 ప్రాజెక్ట్‌పై మరో కీలక అప్డేట్ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. చాలా కాలంగా ప్రీప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాకు తాజాగా స్క్రిప్ట్ ను లాక్ చేసినట్టు తెలుస్తోంది. కథకు సంబంధించిన అన్ని ప్రధాన అంశాలను పూర్తి చేసిన సుకుమార్ ప్రస్తుతం లొకేషన్లు, టెక్నికల్ ప్లానింగ్, క్యాస్టింగ్ వంటి అంశాలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమా గురించి గతంలో వినిపించిన రెండు భాగాల ప్రచారానికి భిన్నంగా, ఒకే సినిమాగా రూపొందించాలని మేకర్స్ నిర్ణయించినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
సుకుమార్ తన ప్రత్యేకమైన కథన శైలికి తగ్గట్టుగానే ఈసారి కూడా కమర్షియల్ యాక్షన్ డ్రామాను కొత్త కోణంలో చూపించనున్నారని సమాచారం. రామ్ చరణ్ క్యారెక్టర్ గత సినిమాలతో పోలిస్తే పూర్తి భిన్నంగా, మరింత మాస్ అప్పీల్‌తో పాటు ఎమోషనల్ డెప్త్ కలిగిన విధంగా డిజైన్ చేసినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఆర్ట్ డిపార్ట్మెంట్, యాక్షన్ బ్లాక్స్, లుక్ టెస్ట్స్ వంటి ప్రీప్రొడక్షన్ వర్క్స్ వేగంగా సాగుతున్నాయని, షూటింగ్ ప్రారంభానికి ముందే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలనే టార్గెట్ తో టీమ్ పనిచేస్తోందని తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను సెప్టెంబర్‌లో అధికారికంగా ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. అనంతరం నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, రెగ్యులర్ షెడ్యూల్‌తో షూటింగ్ కొనసాగించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. రంగస్థలం వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత మరోసారి రామ్ చరణ్- సుకుమార్ కాంబినేషన్లో సినిమా రానుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే షూటింగ్ డేట్స్, రిలీజ్ ప్లాన్ పై మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.








