‘స్పైడర్-మ్యాన్’కు నేను చిన్నప్పటి నుంచే పెద్ద అభిమానిని : రిషబ్ శెట్టి
జాతీయ అవార్డు గ్రహీత, కాంతార హీరో-దర్శకుడు రిషబ్ శెట్టి తాను చిన్నప్పటి నుంచే స్పైడర్-మ్యాన్‌కు వీరాభిమాని అని వెల్లడించారు. Spider-Man: Brand New Day సినిమా విడుదలకు ముందు మార్వెల్ రూపొందించిన ప్రత్యేక వీడియోలో రిషబ్ శెట్టి కనిపించారు. ఇందులో ఆయన స్పైడర్-మ్యాన్‌ను కలుసుకుని, ఆ సూపర్ హీరోపై తనకున్న అభిమానాన్ని పంచుకున్నారు.
రిషబ్ మాట్లాడుతూ.. “ఎన్నో సంవత్సరాల క్రితం సింగిల్ స్క్రీన్ థియేటర్లో మొదటిసారి స్పైడర్-మ్యాన్ సినిమా చూశాను. అప్పుడే పీటర్ పార్కర్ పాత్రతో నాకు అనుబంధం ఏర్పడింది. జీవితంలో తప్పులు చేసినా, కష్టాలు ఎదురైనా మనలోని మంచితనాన్ని కోల్పోకూడదని ఆ పాత్ర నాకు నేర్పింది. అత్యధిక శక్తి ఉంటే అంతే బాధ్యత కూడా ఉండాలనే సందేశం స్పైడర్-మ్యాన్ ఎప్పటికీ గుర్తు చేస్తాడు. అందుకే నా అభిమానం ఇప్పటికీ అలాగే ఉంది. ఇప్పుడు నా పిల్లలకు కూడా స్పైడర్-మ్యాన్ అంటే చాలా ఇష్టం. వాళ్ల కోసమే Spider-Man: Brand New Day టికెట్లు ముందుగానే బుక్ చేశాను. అందరం కలిసి థియేటర్లో ఈ సినిమా చూడబోతున్నాం” అని చెప్పారు.
టామ్ హాలండ్ హీరోగా నటించిన Spider-Man: Brand New Day చిత్రం జూలై 30న భారత్‌లో విడుదల కానుంది. ఈ సినిమా ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.








