బాలకృష్ణను పరామర్శించిన సీఎం చంద్రబాబు
హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రి (AIG Hospital)లో చికిత్స పొందుతున్న ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ (Balakrishna) ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) పరామర్శించారు. ఏఐజీ ఆసుపత్రికి వచ్చిన చంద్రబాబు బాలకృష్ణ ఆరోగ్యపరిస్థితి అడిగి తెలుసుకున్నారు. కాకినాడ పోర్టు (Kakinada Port)లో సినిమా చిత్రీకరణ సందర్భంగా బాలకృష్ణ గాయపడిన విషయం తెలిసిందే. ఎడమ మోకాలి చుట్టూ ఉన్న కణజాలల్లోకి రక్తం చేరడం, వాపు ఉన్నట్లు గుర్తించిన వైద్యులు విజయవంతంగా సర్జరీ పూరి చేశారు. శస్త్ర చికిత్స అనంతరం ఆసుపత్రిలో కోలుకుంటున్న బాలకృష్ణను చంద్రబాబు పరామర్శించారు.
ఇవి కూడా చదవండి








