ఆ పార్టీ నాయకులతో వేదికలు పంచుకోవద్దు : సీఎం చంద్రబాబు ఆదేశం
గొడ్డలి పార్టీ నేతలతో ఎట్టి పరిస్థితుల్లోనూ వేదికలు పంచుకోవద్దని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) పార్టీ నేతలకు ఆదేశించారు. ముఖ్యనేతలతో సీఎం టెలీకాన్పరెన్స్ (Teleconference) నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ గొడ్డలి పార్టీ విష వృక్షమనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. నిత్యం కులాలు, మతాలను అడ్డం పెట్టుకుని విద్వేషాలు రగిలించడమే ఆ పార్టీ పనిగా పెట్టుకుందని విమర్శించారు. గొడ్డలి పార్టీ ట్రాప్లో పడొద్దని నేతలకు చంద్రబాబు హితవు పలికారు. కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై 45 రోజులపాటు టీడీపీ డోర్ టు డోర్ (Door-to-door) కార్యక్రమం చేపట్టనున్న నేపథ్యంలో నేతలకు సీఎం దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలు గెలవాలని సీఎం స్పష్టం చేశారు. టీడీపీ (TDP) సహా కూటమి పార్టీల అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని నేతలకు సూచించారు.








