మళ్లీ కొత్త డ్రామా మొదలుపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి : రామచందర్ రావు
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా విద్యార్థి, యువత జీవితాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) చెలగాటమాడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు (Ramachander Rao) మండిపడ్డారు. మరోవైపు యువత ఎన్నికల్లో పోటీ చేసేలా వయసును 21 ఏళ్లకు తగ్గించాలని కొత్త డ్రామా షురూ చేశారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఖర్గే (Kharge)ను తీసేసి యువ నేతను ఎన్నుకోవచ్చు కదా? అని ప్రశ్నించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా యువ నాయకుడు నితిన్ నబీన్ (Nitin Nabin)ను చేశామని గుర్తు చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ అంశాన్ని డైవర్ట్ చేయడానికే 21 ఏళ్లకు పోటీ అంశాన్ని తెరపైకి తెచ్చారని విమర్శించారు. యువతకు నిరుద్యోగ భృతి, స్కూటీ, రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడికి వెళ్లాయో చెప్పాలని డిమాండ్ చేశారు.








