మల్లన్న దర్శనం సులభం .. కొమురవెల్లిలో
సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి ( Komuravelli) )లో నూతన రైల్వేస్టేషన్ (Railway station)ను కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి (Kishan Reddy), బండి సంజయ్ (Bandi Sanjay) ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ కొమురవెల్లి పుణ్యక్షేత్రంలో రైల్వేస్టేషన్‌ను ప్రారంభించడం చరిత్రాత్మక ఘట్టమన్నారు. హైదరాబాద్ (Hyderabad)తో పాటు ఇతర ప్రాంతాల నుంచి మల్లన్న దర్శనానికి వచ్చే భక్తులకు ఈ స్టేషన్ ద్వారా ప్రయాణం సౌకర్యవంతంగా మారుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్ దత్తాత్రేయ, ఎంపీలు లక్ష్మణ్, రఘునందన్‌రావు, చామల కిరణ్‌కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీ అంజిరెడ్డి పాల్గొన్నారు.








