విద్యార్థుల విజయాన్ని సీఎం రేవంత్ తన ఖాతాలో : కవిత
విద్యార్థులు (Students) సాధించిన విజయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) తన ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత (Kavitha) విమర్శించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ యువతకు ఇచ్చిన హామీలపై ఎక్కడ నిలదీస్తారోనని ఊరేగింపులు చేస్తారా? అని ప్రశ్నించారు. తెలంగాణ యువతకు ఎన్నో హామీలు ఇచ్చి మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ (Congress)దని విమర్శించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే వాళ్లు ఆ పార్టీని గద్దె దించడం ఖాయమన్నారు.








