తిరువీర్ “భగవంతుడు” మూవీ నుంచి సెకండ్ సింగిల్ ‘సిత్తరాల నవ్వు’ రిలీజ్
యంగ్ టాలెంటెడ్ హీరో తిరువీర్ నటిస్తున్న కొత్త సినిమా “భగవంతుడు”. ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటిస్తోంది. కన్నడ నటుడు రిషి ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను ఏషియన్ ఫిలిమ్స్ నారాయణ దాస్ నారంగ్, పనస శంకరయ్య గౌడ్ సమర్పణలో రవి పనస ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1గా నిర్మిస్తున్నారు సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ రవి పనస. ఈ సినిమాతో జి.జి. విహారి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రొమాంటిక్ పీరియడ్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న “భగవంతుడు” సినిమా త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతోంది.
ఈ రోజు ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ‘సిత్తరాల నవ్వు’ రిలీజ్ చేశారు. ఈ పాటను మ్యూజిక్ డైరెక్టర్ కృష్ణ ప్రసాద్ బ్యూటిఫుల్ గా కంపోజ్ చేయగా, డైరెక్టర్ జి జి విహారి ఆకట్టుకునే లిరిక్స్ అందించారు. ప్రముఖ సింగర్ జావెద్ అలీ రిపీటెడ్ గా వినేలా పాడారు. ‘సిత్తరాల నవ్వు’ పాట ఎలా ఉందో చూస్తే – ‘సిత్తరాల నవ్వు, అరే సిలకల్లే నువ్వు, చేమంతి పువ్వు, నీలాల కళ్లు, అరే పారే సెలయేళ్లు, ఒంపు పరవళ్లు..అంటూ సాగుతూ ఏరువాక పున్నమి లాంటి అమ్మాయి, కొండగాలి దేవర వంటి అబ్బాయి మధ్య ప్రేమను చూపిస్తూ రూపొందించిన ఈ మట్టి పాట ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేస్తోంది.








