27th July 2026

_________

- Saidulu

బట్టలు త్వరగా ఆరిపోయే సింపుల్ అండ్ స్మార్ట్ ఐడియాస్ ఇవిగో!

వర్షాకాలంలో లేదా ఎండ తక్కువగా ఉన్నప్పుడు బట్టలు త్వరగా ఆరడం లేదా? ఇక్కడ కొన్ని సింపుల్ అండ్ యూజ్‌ఫుల్ ఐడియాలు మీకోసం!

వాషింగ్ మెషీన్‌లో బట్టలు ఉతికాక అదనపు స్పిన్ సైకిల్ రన్ చేయండి. దీనివల్ల ఎక్కువ నీరు బయటకు పోయి బట్టలు త్వరగా ఆరతాయి.

స్పిన్ సైడ్ వాడకం

తడి బట్టను ఒక పొడి టవల్‌లో చుట్టి గట్టిగా పిండండి. టవల్ అదనపు తేమను పీల్చేస్తుంది, తద్వారా బట్ట త్వరగా ఆరిపోతుంది.

టవల్ ట్రిక్

ఇళ్లలో బట్టలు ఆరేసేటప్పుడు సీలింగ్ ఫ్యాన్ కింద కిటికీలు కొద్దిగా తెరిచి ఉంచితే గాలికి బట్టలు త్వరగా ఆరిపోతాయి.

ఫ్యాన్ కింద ఆరబెట్టడం

అర్జెంట్‌గా బట్ట ఆరాలి అంటే హెయిర్ డ్రైయర్‌ను మీడియం హీట్‌లో పెట్టి తడి బట్టలపై కొన్ని నిమిషాలు ఉంచితే వెంటనే ఆరిపోతాయి.

హెయిర్ డ్రైయర్ వాడకం

బట్టలు ఆరేసేటప్పుడు ఒకదానికొకటి తగలకుండా మధ్యలో కొంచెం ఖాళీ ఉండేలా ఆరవేయాలి. దీనివల్ల గాలి తగిలి త్వరగా ఆరుతాయి.

గ్యాప్ ఇవ్వడం

కొద్దిగా తడిగా ఉన్న బట్టలపై వేడి వేడిగా ఐరన్ బాక్స్ పెట్టడం వల్ల మిగిలిన తేమ కూడా ఆవిరైపోయి బట్టలు రెడీ అవుతాయి.

ఐరన్ ట్రిక్

బట్టలను నేరుగా లైన్‌పై వేసే బదులు హ్యాంగర్లకు తగిలించి ఆరేయండి. దీనివల్ల గాలి బాగా తగిలి త్వరగా ఆరుతాయి.

హ్యాంగర్స్ ఉపయోగం

బట్టలను మడతలు లేకుండా చాలా వెడల్పుగా ఆరేయాలి. ముడతలు ఉంటే గాలి తగలక ఆరడానికి చాలా సమయం పడుతుంది.

వెడల్పుగా వేయడం

ఈ చిన్న చిన్న స్మార్ట్ చిట్కాలు పాటిస్తే ఎలాంటి వాతావరణంలోనైనా మీ బట్టలు చాలా త్వరగా, సులభంగా ఆరిపోతాయి!