19వ ఆటా మహాసభలు.. అలరించనున్న కీరవాణి లైవ్ కాన్సర్ట్
ATA: అమెరికాలోని బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా జులై 31 నుండి ఆగస్టు 2, 2026 వరకు జరగనున్న 19వ అమెరికన్ తెలుగు సంఘం ( ATA) కాన్ఫరెన్స్ , యూత్ కన్వెన్షన్ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ చారిత్రాత్మక మహాసభల్లో భాగంగా ప్రముఖ సంగీత దర్శకులు ఎం.ఎం. కీరవాణి లైవ్ కాన్సర్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
ఈ సంగీత విభావరిలో త్రిఒరి (Threeory) , ఆరెంజ్ స్ట్రీట్ (Orange Street) మ్యూజిక్ బ్యాండ్ల ఆధ్వర్యంలో ఉర్రూతలూగించే ప్రదర్శనలు ఉండనున్నాయి. అమెరికాలోని తెలుగు ప్రజలందరికీ అద్భుతమైన వినోదాన్ని పంచేందుకు ఈ వేడుకలు సర్వం సిద్ధం చేశామని నిర్వాహకులు తెలిపారు.








