19వ ఆటా మహాసభల్లో ‘ వివాహ పరిచయ వేదిక’ కార్యక్రమం
ATA :అమెరికాలోని బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా జులై 31 నుండి ఆగస్టు 2, 2026 వరకు జరగనున్న 19వ అమెరికన్ తెలుగు సంఘం ( ATA) కాన్ఫరెన్స్ , యూత్ కన్వెన్షన్ వేడుకల్లో భాగంగా ‘ఆటా వివాహ పరిచయ వేదిక’ (ATA Matrimony) కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
కార్యక్రమ వివరాలు..
ఈ వేడుకల్లో భాగంగా ఆగస్టు 1 , 2 తేదీలలో, బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లోని రూమ్ నెం. 327 లో మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ వివాహ పరిచయ వేదిక కొనసాగనుంది. ఈ కార్యక్రమానికి ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేదు, పూర్తిగా ఉచితంగా (Free Registration) నమోదు చేసుకోవచ్చు.
అమెరికాలో స్థిరపడిన తెలుగు యువతీ యువకుల తల్లిదండ్రులకు వివాహ వేదికల ద్వారా సరైన సంబంధాలు కుదిర్చేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు. ఆసక్తి గల వారు అధికారిక వెబ్సైట్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు.








