మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’ సెన్సేషనల్ రన్.. వరల్డ్‌వైడ్‌గా రూ.150 కోట్లు దాటిన గ్రాస్
మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ రన్ కొనసాగిస్తోంది. అద్భుతమైన వసూళ్లతో దూసుకెళ్తున్న ఈ సినిమా రెండో వారంలోనూ స్ట్రాంగ్ కలెక్షన్స్ నమోదు చేస్తోంది. వీకెండ్లో వసూళ్లు మరింతగా పెరిగాయి. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర తన జోరును కొనసాగిస్తోంది.
ఇప్పటికే ‘ఇరుముడి’ వరల్డ్‌వైడ్‌గా రూ.150 కోట్ల గ్రాస్ మార్క్‌ను క్రాస్ చేసింది. రవితేజ కెరీర్లో ఇదొక మైలురాయి కావడం విశేషం. ఈ సెన్సేషనల్ రన్లో నైజాం ఏరియా కీలకంగా నిలిచింది. అక్కడ రూ.50 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. మిగతా ఏరియాల్లోనూ సినిమా ఇంప్రెసివ్ కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది.
ముఖ్యంగా రీజినల్ సినిమాల్లో బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటిగా ‘ఇరుముడి’ నిలిచింది. అలాగే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు అత్యంత లాభదాయకమైన థియేట్రికల్ వెంచర్స్‌లో ఒకటిగా నిలుస్తోంది.
రెండో వారంలోనూ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. పలు సెంటర్లలో హౌస్‌ఫుల్ షోలు కొనసాగుతున్నాయి. ఈరోజు కనిపించిన జోరు రేపు కూడా కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు.
కొత్త సినిమాల నుంచి పోటీ ఉన్నప్పటికీ ఆడియన్స్ పెద్ద సంఖ్యలో థియేటర్లకు వస్తుండటంతో ‘ఇరుముడి’ రియల్ బ్లాక్‌బస్టర్‌గా తన స్థానాన్ని మరింత బలపరుచుకుంటోంది. ఫైనల్‌గా మరింత భారీ కలెక్షన్స్ నమోదు చేసే దిశగా సినిమా వెళ్తోంది.








