మగాడిని కోడలిగా మార్చితే..: ‘ప్యార్ ప్రేమ కళ్యాణం’ రివ్యూ
Rating: 2.5
ఎలన్(ఎలన్) మంచి కుర్రాడే. కానీ అతనికి వచ్చిన ఓ ఆలోచన…దుబాయిలో చేస్తున్న మంచి ఉద్యోగం వదిలేసి ఇంటికి వచ్చేలా చేస్తుంది. ఆ ఆలోచన తన తండ్రి (M.S భాస్కర్) ఏక్సెప్ట్ చేయరని తెలిసినా,ఒప్పిద్దాములే అని ధైర్యం చేస్తాడు. ఇంతకీ అతని ఆలోచన ఏమిటీ అంటే…స్వదేశంలో చక్కగా ఉద్యోగం సంపాదించి, ఇక్కడ ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొందామని, కుటుంబంతో ఉందామని.
అలా వచ్చిన ఎలన్ కు… ఇక్కడ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ పవిత్ర అలియాస్ ‘పర్పుల్ పవి’ (సాన్వి మేఘన) అనుకోకుండా పరిచయం అవుతుంది. ఆమె gender equality గురించి ఎప్పుడూ వీడియోలు చేస్తూంటుంది. ఆ విషయం తెలియని ఎలన్ .. తొలి చూపులోనే ప్రేమలో పడిపోతాడు. ఆమెను మెల్లిగా ఒప్పించి పెళ్లి దాకా తీసుకెళ్తాడు. అంతదాకా బాగానే ఉంటుంది.అయితే ఇక్కడే మెలిక ..ఆమెకు రొటీన్ గా ఆలోచించే రకం కాదు. కాస్త డిఫరెంట్..పెళ్లయ్యాక…అత్తవారింటికి ఆడపిల్లే వెళ్లాలా..మగాడు రాకూడదా అని అడుగుతుంది.
దాంతో వేరే దారి లేక ఇల్లరికం అల్లుడుగా ఆమె వెనకే ఆమె ఇంట్లో ప్రవేశిస్తాడు. అక్కడ అత్తగారు రాధిక..మామగారు, భార్య తాతగారు వీళ్లతో లైఫ్ స్టార్ట్ చేస్తాడు. అయితే ఇల్లరికం లో ఉన్న మజా ..అనుభవిస్తేనే తెలియనులే అన్నట్లుగా అతని పరిస్ధితి గందరగోళం అవుతుంది. అందుకు కారణం అతనికి ఉద్యోగం దొరక్కపోవటం. మొదట వారం రోజులు హ్యాపీగా కొత్త అల్లుడికి సపర్యలు జరిగినా ఆ తర్వాత అసలు ట్విస్ట్ పడుతుంది. అదేంటో మీరు ఊహించగలిగేదే..కాకపోతే తెరమీద చూస్తే కామెడీ.
ఎలా ఉందంటే..
ఈ సినిమా CORE IDEA చాలా స్ట్రాంగ్.. “ఒక పురుషుడు పెళ్లి తర్వాత సంప్రదాయంగా ఒక మహిళ ఎదుర్కొనే జీవితాన్ని ఎదుర్కొంటే?” అనేది.. ఇది చాలా మంచి dramatic premise.ఇక్కడ gender reversal ద్వారా సినిమా చాలా విషయాలు explore చేయొచ్చు.
ఇంట్లో కోడలిపై ఉండే అంచనాలు, అల్లుడిపై ఉండే అంచనాలు, ఉద్యోగం లేని పురుషుడిని సమాజం ఎలా చూస్తుంది?భార్య సంపాదిస్తే భర్త ego ఎలా స్పందిస్తుంది?, ఇంటి పనిని ఎందుకు “పని”గా చూడరు?, అత్త–కోడళ్ల conflictలో gender మార్చితే అది ఎలా కనిపిస్తుంది? పెళ్లి తర్వాత వ్యక్తి తన identityని ఎలా కోల్పోతాడు? ఇవి అన్నీ మంచి సినిమా మెటీరియల్.
అయితే ఇవన్నీ Premiseను explore చేస్తే వచ్చే విషయాలు. వాటిని “ఇదే సమస్య” అని ప్రేక్షకుడికి ఎక్సపీరియన్స్ చేయంచకుండా “ఇదే సమస్య” అని charactersతో చెప్పించటం ఎక్కువైంది.
మరీ ముఖ్యంగా Elanని sympathetic characterగా చూపించాలని సినిమా ప్రయత్నిస్తుంది. దాంతో “పురుషుడికి ఇంటిపని ఎందుకు అవమానం అనిపిస్తుంది?” అనిపించాల్సిన మనకి.. “పాపం ఈ మనిషి ఎంత కష్టపడుతున్నాడు.” అనిపిస్తుంది. Conflict పెరగడం బదులు conflict repeat అవుతుంది. అందుకే ఫస్టాఫ్ ఉన్నట్లుగా సెకండాప్ ఆ స్దాయిలో కనిపించదు. story predictable అవుతుంది.
కామెడీ కోసం .. హీరో పాత్ర ఎమోషన్ ని మనం ఎక్సపీరియన్స్ చేసే గ్యాప్ ఇవ్వలేదు. కొన్ని జోక్ లు బాగా పేలాయి. కొన్ని సోసో గా చప్పగా ఉన్నాయి.
ఫైనల్ థాట్
నవ్వించటమే లాజిక్ అయితే ఈ సినిమా దాన్ని బాగానే దాటింది. అంతకు మించి ఎక్సపెక్టే చేస్తే మాత్రం కాస్త ఇబ్బంది. ఫ్యామిలీతో సరదాగా ఓ లుక్కేయచ్చు. పెళ్లి కాని ప్రసాద్ లు కాస్తంత జాగ్రత్తగా ఉండాలి ప్రేమించే అమ్మాయి విషయంలో అనేది చెప్తుంది.
ఎక్కడ చూడచ్చు?
నెట్ ప్లిక్స్ లో తెలుగులో ఉంది
—సూర్య ప్రకాష్ జోశ్యుల








