Reddit టైమ్ అయిపోయిందా? RIP చెప్పే రోజులు వచ్చేశాయా?
—సూర్య ప్రకాష్ జోశ్యుల
మీకు ఏదైనా సమస్య వస్తే ఎప్పుడూ మొదటగా ఏం చేస్తారు?
Googleలో వెతుకుతారా? YouTube వీడియో చూస్తారా? లేదా ChatGPTని అడుగుతారా?.AI వచ్చాక లెక్కలు మారుతున్నాయి కానీ …గత కొన్నేళ్లుగా కోట్లాది మంది తమ ప్రశ్నలకు సమాధానాలు వెతికే ఏకైక ప్లేస్ మాత్రం Reddit.అంతలా అది ఓ తరం జీవితంలో భాగమైపోయింది. బయట నుంచి చూస్తే Reddit మరో సోషల్ మీడియా సైట్లాగే కనిపిస్తుంది. కానీ దాని అసలు స్వరూపం వేరు.
Redditలో కనిపించేది కేవలం information కాదు — lived experience. అందుకే ప్రపంచం నలు మూలల నుంచి దాన్ని ఫాలో అవుతూంటారు. అది ఎంతలా యూత్ ఆలోచనలను, సమాజ పరిస్ధితులను ప్రభావం చేస్తోందంటే..చివరకి హాలీవుడ్ సైతం ఈ Redditలో కంటెంట్ ని ఫాలో అయ్యి ఓ సినిమానే చేసేసింది.
Backrooms సినిమా కు మూలం
మీకు గుర్తుందా? ఒక టైమ్ లో కొన్ని చిత్రమైన ఫొటోలు Redditలో వైరల్ అయ్యాయి. తర్వాత అదే ఐడియా “Backrooms” అనే హారర్ సినిమాగా మారింది. 2026లో A24 విడుదల చేసిన Backrooms సినిమా కేవలం $10 మిలియన్ల (₹83–84 కోట్లు) production budgetతో రూపొందింది. అది ఫస్ట్ వీకెండ్ లోనే ప్రపంచవ్యాప్తంగా సుమారు $117.9 మిలియన్లు సంపాదించింది. ఆగస్టు నాటికి ప్రపంచ box office $393 మిలియన్లకు ( ₹3,300 కోట్లకు) పైగా వసూలు చేసింది.
ఇది Reddit అసలు స్టామినా ఏమిటో చెప్పే చిన్న ఉదాహరణ మాత్రమే.
Redditలోని అసలు ఆస్తి అక్కడ కనిపించే పోస్టులు కాదు. ఆ పోస్టుల వెనుక ఉన్న మనుషుల ఊహ, అనుభవం, అభిప్రాయం. ఇప్పుడు అదే Reddit కి టైమ్ అయిపోయింది, RIP చెప్పే రోజులు వచ్చేశాయంటున్నారు. అందులో నిజమెంత..అసలేం జరుగుతోంది?
Reddit కు గడ్డు రోజులు
Redditపై AI కంపెనీల కన్ను పడింది. ఎందుకంటే Googleలో వెతికితే ఒక కంపెనీ చెప్పే సమాచారం దొరకవచ్చు. Redditలోకి వెళ్తే ఆ వస్తువును కొన్న మనిషి నిజంగా ఏమనుకున్నాడో తెలుస్తుంది. AIకి ఈ తేడా చాలా ముఖ్యం.
అందుకే AI Redditను చదవాలనుకుంటోంది Reddit కూడా ఈ విషయాన్ని చాలా త్వరగానే అర్థం చేసుకుంది. తన డేటాను AI కంపెనీలు ఉపయోగించాలంటే దానికి డబ్బు చెల్లించాలనే దిశగా వెళ్లింది. OpenAIతో ఒప్పందం చేసుకుంది. ఇతర AI కంపెనీలతోనూ డేటా ఒప్పందాలు జరిగాయి. అంటే Redditకు ఒక కొత్త business model కనిపించింది.చూడటానికి ఇది అద్భుతమైన వ్యాపారం. Redditలోని కోట్లాది conversations ఒక్కసారిగా విలువైన ఆస్తిగా మారాయి. కానీ… ఇక్కడే ఒక ప్రమాదకరమైన సమస్య మొదలవుతుంది.
సమస్య ఏమిటి..
Redditలో మనుషులు సంవత్సరాలుగా సృష్టించిన జ్ఞానాన్ని AI తీసుకుంటుంది. ఆ జ్ఞానంతో తన మోడళ్లను మరింత తెలివిగా చేసుకుంటుంది. మనకు సమాధానాలు ఇస్తుంది. Recommendations ఇస్తుంది. Reviewsని సారాంశం చేస్తుంది. మన ప్రశ్నలకు Redditలోని వందల కామెంట్లను చదవాల్సిన అవసరం లేకుండా ఒకే సమాధానంగా మార్చి ఇస్తుంది.
అలాంటప్పుడు ఆ జ్ఞానాన్ని సృష్టించిన Reddit దగ్గరకు మనం ఎందుకు తిరిగి వెళ్లాలి? ఇదే అసలు సమస్య.
ఇదే విచిత్రమైన irony.
AIకి Reddit అవసరం. కానీ అదే..AI ప్రపంచానికి Reddit అవసరం తగ్గేలా చేస్తోంది కూడా. అంటే ఓ ideas factory మెల్లి మెల్లిగా మూతపడే స్టేజీకి వస్తుందా.త్వరలో Reddit కి రిప్ చెప్పేసే సమయం వచ్చేసిందా అనిపిస్తోంది.
అలా కాకుండా Reddit… AI యుగంలో కూడా Internetలోని అత్యంత విలువైన మానవ స్వరంగా కొనసాగితే మాత్రం మనం అదృష్టవంతులమే.








