“నేను మనిషినే” అనే హ్యూమన్ గుర్తింపు కార్డ్ తీసుకున్నారా?
— సూర్య ప్రకాష్ జోశ్యుల
అదో సిటీ రాత్రి అయ్యింది. అక్కడో పెద్ద క్యూ. ఉదయం నుంచి ఆ క్యూ పెరుగుతూనే ఉంది కానీ తగ్గటం లేదు. వందల మంది తమ turn కోసం wait చేస్తున్నారు. ఆ క్యూ చివర్లో… వెండి రంగులో ఒక గుండ్రటి machine. చూడటానికి కాస్త futuristicగా ఉంది వ్యవహారం.
ఒక giant robot eye లా. ఒక్కొక్కరు ముందుకు వెళ్తున్నారు. దాని ముందు నిలబడుతున్నారు. కళ్లను scan చేయించుకుంటున్నారు. కొన్ని seconds…అంతే…
Done.
వాళ్లు వెళ్లిపోతున్నారు. అసలు ఏం జరుగుతోంది? అని ఆరాతీస్తే “మీరు human నేనా?” అని machine check చేస్తోంది. ఇది జపాన్ లో జరుగుతున్న సీన్. మన దేశంలోనూ ఈ మధ్యనే మొదలైన కొత్త సన్నివేశం. మనం మనుష్యులమేగా, ప్రత్యేకంగా నేను మనిషిని అని ఎందుకు ప్రూవ్ చేసుకోవటం ఎందుకు అంటారా. పరిస్ధితులు అలా వచ్చాయి మరి. మనిషిగా పుట్టాం. ఇన్ని సంవత్సరాలు మనిషిగానే ఉన్నాం. కానీ ఇప్పుడు… Machine ఒకసారి OK చెప్పి సర్టిఫికేట్ ఇవ్వాలి. లేకపోతే మనం మనుష్యులం కాదు. ఆ machine పేరు Orb.
Orb అసలు ఏంటి?
Simpleగా చెప్పాలంటే… Orb = “నేను real human” అని prove చేసే digital verification. AI bots మనుషుల్లా behave చేస్తున్న ఈ రోజుల్లో… “ఈ account వెనుక నిజంగా మనిషే ఉన్నాడా?” అని check చేయడానికి వచ్చిన కొత్త technology ఇది.
Orb ముందు నిలబడతారు. మీ eyes scan అవుతాయి. తర్వాత మీకు World ID అనే digital identity వస్తుంది. అంటే మన దగ్గర ఇప్పటికే Aadhaar ఉంది. PAN ఉంది. Passport ఉంది. Driving Licence ఉంది. ఇప్పుడు ఇంకో ID.
“Bro… నేను robot కాదు!” అని చెప్పే ID.
AI bots పెరిగిపోతున్న కొద్దీ ఈ Human IDకి demand పెరుగుతుందని దీని వెనుక ఉన్న కంపెనీ చెబుతోంది.
మరి దీన్ని ఎందుకు తీసుకోవాలి?
ఎందుకంటే Internet ఇప్పుడు కాస్త wildగా మారిపోయింది. ఒకప్పుడు fake account అంటే ఒక మనిషి create చేసిన account. ఇప్పుడు? ఒక AI వేల ఎక్కౌంట్స్ క్రియేట్ చేయగలదు. Bots comments పెట్టగలవు. Messages పంపగలవు. వెబ్ సైట్స్ లో లో తిరగగలవు. మన తరపున shopping కూడా చేయగలవు.
అంటే screen అవతల ఉన్నది… మనిషా? AIనా? అనే డౌట్ పెరుగుతోంది. అందుకే కొన్ని digital servicesలో “First prove you’re human. Then come in.” అనే కాన్సెప్టు వచ్చే అవకాసం ఉందని ముందస్తు జాగ్రత్త ఇది.
సామాన్యుడుకి benefit ఏంటి?
మొదటి బెనిఫిట్… Fake accounts తగ్గే అవకాశం. ఒక వ్యక్తి నిజమైన human అని verify చేస్తే, botsతో వేల fake accounts క్రియేట్ చేయడం కష్టమవుతుంది. రెండోది… Online trust. మీరు మాట్లాడుతున్నది real person యేనా? అనేది క్లారిటీ వస్తుంది.
అంటే ఒక dating profile వెనుక నిజమైన వ్యక్తే ఉన్నాడా? ఒక online communityలో ఉన్న account నిజంగా humanదేనా? ఇలాంటి చోట Human ID ఉపయోగపడొచ్చు. WorldIDను Zoom, Tinder, Shopify, DocuSign వంటి కొన్ని platformsలో human verification కోసం ఉపయోగిస్తున్నట్లు సంస్థ చెబుతోంది. అంటే futureలో… “Real human” అనేది కూడా ఒక ఫీచర్ అయిపోవచ్చు.
మరి అందరూ Orb తీసుకోవాలా?
అక్కర్లేదు. ఇది mandatory కాదు. Orb తీసుకోకపోతే… మీ Aadhaar cancel కాదు. Bank account block కాదు. Passport cancel కాదు. ఎవరూ ఇంటికి వచ్చి “మీ Human ID ఎక్కడ?” అని అడగరు. ప్రస్తుతానికి ఇది optional digital identity. మీకు ఉపయోగం ఉంటే తీసుకోవచ్చు. లేకపోతే… Skip.








