ఆక్స్ఫర్డ్ వర్సిటీని సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి
ప్రపంచంలోనే అత్యంత పురాతన, ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయాల్లో ఒకటైన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి సందర్శించారు. దాదాపు 900 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ విశ్వవిద్యాలయంలో సీఎం ప్రతినిధి బృందంతో కలిసి పర్యటించారు.
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిధిలోని బ్లావాట్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్‌ను కూడా ముఖ్యమంత్రి సందర్శించారు. ఆక్స్ఫర్డ్ అనుబంధ విద్యాసంస్థల్లోని నూతన సంస్థల్లో ఇది ఒకటి. ఈ సందర్భంగా ప్రొఫెసర్ మాయా ట్యూడర్, ప్రొఫెసర్ ఫైసల్ దేవ్‌జీ తెలంగాణ ప్రతినిధి బృందాన్ని క్యాంపస్‌లో కలిశారు.
సమావేశంలో మాజీ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావుతో పాటు ఇతర అధికారులు, ప్రతినిధులు. తెలంగాణకు సంబంధించిన పలు అంశాలు, పాలన, విద్య, ప్రజా విధానాలపై చర్చలు ప్రారంభమయ్యాయి.
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి భారతదేశంతోనూ ప్రత్యేక అనుబంధం ఉంది. మాజీ ప్రధానమంత్రి దివంగత ఇందిరా గాంధీ ఆక్స్‌ఫర్డ్‌లో విద్యాభ్యాసం చేశారు.








