ఇలా మాట్లాడే వారిపై ఏఐసీసీ చర్యలు తీసుకోవాలి : కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
మంత్రి కొండా సురేఖ (Konda Surekha) కుమార్తె చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్లో దుమారం రేగుతోంది. సుస్మిత ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy)పై చేసిన వ్యాఖ్యలను పార్టీ ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండించారు. సీఎల్పీ వేదికగా దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు ( MLAs), ఎమ్మెల్సీలు ( MLCs) మీడియా సమావేశం నిర్వహించి, పార్టీకి నష్టం కలిగించే విధంగా మాట్లాడే వారిపై చర్యలు తీసుకోవాలని అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. సుస్మిత (Susmitha) వ్యాఖ్యలతో సంబంధం లేదని మంత్రి కొండా సురేఖ చెప్పటం సరికాదు. ఆమె వ్యాఖ్యలతో సంబంధం లేకపోతే సురేఖ ఖండించాలి. కొండా సురేఖ గతంలోనూ నోరు జారి పార్టీకి ఇబ్బంది తెచ్చిపెట్టారు. కొండా కుటుంబం భాష ఎప్పుడూ పార్టీకి తలనొప్పిగానే ఉంది. మీ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మÖల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది.
ఇలా మాట్లాడే వారిపై ఏఐసీసీ ( AICC) చర్యలు తీసుకోవాలి. కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి, వారి సోదరులు కష్టపడ్డారు. సీఎం, పార్టీ గురించి ఇలా బహిరంగంగా మాట్లాడటం సరికాదు. ఏదైనా ఉంటే సీఎల్పీ, పీసీసీ సమావేశంలో మాట్లాడాలి. సీఎంపై ఎవరు తప్పుడు ఆరోపణలు చేసినా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. సీఎంకు సొంత పార్టీ నేతలు అండగా ఉండాలి కానీ, పార్టీలో ఉంటూ సీఎం నిర్ణయాన్ని తప్పుపట్టడం సరికాదు. చెట్టు మీద ఉండి, ఆ చెట్లు కొమ్మనే నరుక్కునే వైఖరి సరికాదు. సుస్మిత వ్యాఖ్యలు ప్రతిపక్షాలకు బలం ఇచ్చినట్టు అవుతుంది అని పలువురు ఎమ్మెల్యేలు పేర్కొన్నారు.








