అమెరికా ఎంఐటీకి సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు వెళ్తున్నారో చెప్పాలి? : ఎంపీ అర్వింద్
ఇంజినీరింగ్ విద్యార్థుల (Engineering students)ను తక్కువ చేసిన మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అమెరికాలోని ఎంఐటీ (MIT)కి ఎందుకు వెళ్తున్నారో చెప్పాలని ఎంపీ ధర్మపురి అర్వింద్ (Dharmapuri Arvind) ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా (America) పర్యటనలో భాగంగా పలు విద్యా సంస్థలను సందర్శించనున్నారు. ఇటీవల ఇంజినీరింగ్ విద్యార్థుల స్థాయిని తగ్గించి మాట్లాడిన సీఎం అమెరికా విద్యా సంస్థల్లో ఏం విషయంపై మాట్లాడనున్నారో చెప్పాలి అని డిమాండ్ చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు.








