19వ ఆటా మహాసభలలో సతీశ్ రామసహాయం రెడ్డి ప్రత్యేక లైవ్ షో
ATA: అమెరికాలోని బాల్టిమోర్ వేదికగా జులై 31 నుండి ఆగస్టు 2, 2026 వరకు జరగనున్న 19వ అమెరికన్ తెలుగు సంఘం (ATA) కాన్ఫరెన్స్, యూత్ కన్వెన్షన్ వేడుకల నేపథ్యంలో ప్రత్యేక లైవ్ షో నిర్వహించనున్నారు. అటా ప్రెసిడెంట్ ఎలెక్ట్ సతీశ్ రామసహాయం రెడ్డి (Satish Ramasahayam Reddy) ఈ లైవ్ షోలో పాల్గొని మహాసభల విశేషాలను పంచుకోనున్నారు.
లైవ్ షో వివరాలు..
తేదీ జులై 26, 2026 (ఆదివారం) రోజున ప్రసారమయ్యే ఈ లైవ్ షో టైమింగ్స్ ఇలా ఉన్నాయి.
ఈస్ట్ (EST) ప్రకారం సాయంత్రం 5:00 PM నుండి 5:30 PM వరకు,
సెంట్రల్ (CST) ప్రకారం సాయంత్రం 4:00 PM నుండి 4:30 PM వరకు ,
ఇండియన్ స్టాండర్డ్ టైమ్ (IST) ప్రకారం తెల్లవారుజామున 2:30 AM నుండి 3:00 AM వరకు ప్రసారం అవుతుంది.
ఈ వేదిక, ప్రసారానికి సంబంధించి, తెలుగు ఎన్.ఆర్.ఐ రేడియో (www.telugunriradio.com), మొబైల్ యాప్స్ ద్వారా ఈ లైవ్ షో వీక్షించవచ్చు. మహాసభలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి తెలుగు ప్రజలందరూ ఈ లైవ్ షోను వీక్షించాల్సిందిగా నిర్వాహకులు కోరుతున్నారు.








