నెదర్లాండ్స్‌లో బీఆర్ఎస్ బృందంతో మహేష్ బిగాలా ప్రత్యేక సమావేశం
నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డామ్‌లో బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేష్ బిగాలాకు స్థానిక బీఆర్ఎస్ బృందం ఘనంగా స్వాగతం పలికింది. ఈ పర్యటన సందర్భంగా ఆయన పార్టీ శ్రేణులతో సమావేశమై పలు కీలక విషయాలపై చర్చలు జరిపారు.
ఈ సమావేశంలో ప్రస్తుత తెలంగాణ రాజకీయ పరిస్థితులు, పార్టీ భవిష్యత్ ప్రణాళికలు , ప్రవాస భారతీయుల బాధ్యతలపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రంలో మళ్లీ అభివృద్ధి , సంక్షేమం జోరు అందుకోవాలంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) మళ్లీ ముఖ్యమంత్రి పీఠం అధిష్టించడం అత్యంత అనివార్యమని మహేష్ బిగాలా అభిప్రాయపడ్డారు. కేసీఆర్ నాయకత్వంలోనే రాష్ట్రం మరోసారి ప్రగతి పథంలో ముందుకుసాగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
సభ్యత్వ నమోదు కార్యక్రమం..
అలాగే, కేటీఆర్ నిర్దేశం మేరకు త్వరలోనే నెదర్లాండ్స్‌లో బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే పూర్తి స్థాయి నెదర్లాండ్స్ కమిటీని ప్రకటిస్తామని ఆయన స్పష్టం చేశారు.
రాబోయే కాలంలో పార్టీ మరింత బలపడేందుకు ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని, బీఆర్ఎస్ సిద్ధాంతాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని నెదర్లాండ్స్ బృందానికి ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నెదర్లాండ్స్ ప్రతినిధులు పవన్, పృథ్వి, సందీప్, సత్య, గణేష్ తదితరులు పాల్గొన్నారు. నెదర్లాండ్స్‌లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అందరం కలసికట్టుగా శ్రమిస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు.








