జి.వి. ప్రకాష్ కుమార్, కయదు లోహర్ ‘ఇమ్మోర్టల్’ నుంచి ‘షీ ఈజ్ మై’ సాంగ్
మల్టీ ట్యాలంటెడ్ జి.వి. ప్రకాష్ కుమార్, కయదు లోహర్ జంటగా నటిస్తున్న డార్క్ పాంటసీ సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘ఇమ్మోర్టల్’ మరియప్పన్ చిన్న దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అరుణ్‌కుమార్ ధనశేఖరన్ నిర్మిస్తున్నారు ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా ‘ఇమ్మోర్టల్’ నుంచి రొమాంటిక్ మెలోడీ ‘షీ ఈజ్ మై’ లిరికల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు.
ఈ పాటకు సామ్ సీఎస్ అందించిన సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
అరవింద్ శ్రీనివాస తన వోకల్స్ పాటకు ప్రాణం పోయగా, రాజశ్రీ సుధాకర్ రాసిన సాహిత్యం ప్రేమలోని భావోద్వేగాలను అందంగా పలికించింది.
ఈ పాటలో జి.వి. ప్రకాష్ కుమార్, కయదు లోహర్‌ల మధ్య కెమిస్ట్రీ చాలా ఆసక్తికరంగా వుంది.
మనసును హత్తుకునే ట్యూన్, లిరిక్స్‌తో ‘షీ ఈజ్ మై’ సంగీత ప్రియులను ఆకట్టుకునే మెలోడీగా నిలిచింది.








