సభలో ప్రతిపక్షాలను సమర్థవంతంగా ఎదుర్కొన్న ప్రభుత్వం..ఎవరెవరు ఏం మాట్లాడారంటే
పేపర్ లీక్‌లు అరికట్టేందుకే యాంటీ పేపర్ లీక్ బిల్లును తీసుకువస్తున్నట్లు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. మంగళవారం యాంటీ పేపర్ లీక్ బిల్లుపై లోక్‌సభలో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ చరిత్రలోనే ఈ చట్టం ఒక మైలురాయిగా నిలుస్తుందని జితేంద్ర సింగ్ అభివర్ణించారు. విద్యార్థుల భవిష్యత్ కోసం మోదీ కృషి చేస్తున్నారని వివరించారు.
దేశవ్యాప్తంగా పేపర్ లీక్‌లు జరుగుతున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలోనూ ఆర్ఆర్బీ పేపర్ లీక్ అయ్యిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో ఎన్నోసార్లు పరీక్షా పత్రాలు లీకయ్యాయని మండిపడ్డారు. అయితే పరీక్షల నిర్వహణలో సంస్కరణలను కాంగ్రెస్ వ్యతిరేకించిందని తెలిపారు. 2010లో NTA ఏర్పాటు విజ్ఞప్తిని కాంగ్రెస్ పట్టించుకోలేదని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
బాన్సురీ స్వరాజ్..
బీజేపీ ఎంపీ బాన్సూరీ స్వరాజ్ కూడా ప్రతిపక్షాల తీరుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లును సమర్థించారు. లోక్‌సభలో జెన్ జెడ్ (Gen Z) యాసను ఉపయోగించారు. “ఒకవేళ నేను దీన్ని జెన్ జెడ్ భాషలో చెప్పాలంటే, ‘మోదీజీ క్లాక్డ్ ఇట్’ అని అంటాను” అని ఆమె అన్నారు.ప్రశ్నపత్రాల లీకేజీని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒక “ఘోరమైన పాపం”గా గుర్తించారని, విద్యార్థుల భవిష్యత్తును పరిరక్షించడమే ఈ సవరణ ఉద్దేశమని స్వరాజ్ పేర్కొన్నారు.ప్రశ్నపత్రం లీక్ కేసుల విచారణను రెండు నెలల్లోపు పూర్తి చేయాలని, అటువంటి కేసుల నిర్వహణకు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమిస్తామని ఆమె చెప్పారు.
నేరం రుజువైన వారికి ఏడు నుండి 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ. 5 కోట్ల వరకు జరిమానా విధిస్తారని ఆమె తెలిపారు.
తేజస్వీ సూర్య
భారతదేశంలో విద్యా రంగంలోని ప్రతి శాఖను పూర్తిగా మార్చే ప్రక్రియలో ఎన్డీఏ ఉంది” అని ఎంపీ తేజస్వీ సూర్య అన్నారు. పేపర్ లీక్‌లు, విద్యా సంబంధిత నేరాలను యూపీఏ ప్రభుత్వం తగినంతగా సీరియస్‌గా తీసుకోలేదని విమర్శించారు. యువత సంక్షేమంపై కాంగ్రెస్‌కు నిజంగా అంత ఆసక్తి ఉంటే, వారు తమ పాలనలోనే ఇలాంటి పేపర్ లీక్ నిరోధక బిల్లును ఆమోదించి ఉండేవారు” అని ఆయన అన్నారు.విద్యా వ్యవస్థలో ప్రస్తుతం ఉన్న సమస్యలు యూపీఏ (UPA) ప్రభుత్వం నుండి ఎన్డీఏ (NDA)కు సంక్రమించాయని, ఆ వ్యవస్థాగత సమస్యలను ప్రస్తుత ప్రభుత్వం పరిష్కరిస్తోందని ఆయన పేర్కొన్నారు.








