దేశంలో మరో పార్టీ తెరపైకి.. E20 జనతా పార్టీ…
నీట్ పేపర్ లీకేజీపై నిరసనలు చేపట్టి, దేశ వ్యాప్తంగా పేరుగడించిన కాక్రోచ్ జనతా పార్టీ వ్యంగ్యంగా మరో పార్టీ ప్రారంభమైంది. దాని పేరు E20 జనతా పార్టీ. సోషల్ మీడియా వేదికగా ఈ పార్టీ ప్రారంభమైంది. పెట్రోల్ బంకుల్లో 20 శాతం ఇథనాల్ కలిసిన ఇంధనంతో పాటు 100 శాతం స్వచ్ఛమైన పెట్రోల్ అందుబాటులో వుండాలనేది ఈ పార్టీ ప్రధాన డిమాండ్.
అలాగే E20 పెట్రోలు, సాధారణ పెట్రోలును ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ప్రజలకు వుండాలని ఈ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఎక్స్(ట్విట్టర్)లో ఆరంభమైన ఈ పార్టీ ఖాతాలకు ఇప్పటికే 2,95,000 మంది ఫాలోవర్లుగా మారిపోయారు. ప్రస్తుతం దేశంలో ఈ20 కలిపిన పెట్రోల్ (ఈ20)ను విక్రయిస్తున్నారు. దీనివల్ల మైలేజీ తగ్గుతోందని, ఇంజన్లో సమస్యలు వస్తున్నాయని వాహనదారులు గగ్గోలు పెడుతుండడం తెలిసిందే.
ఈ నేపథ్యంలో 100 శాతం స్వచ్ఛమైన పెట్రోల్‌ను కూడా బంకుల్లో అందుబాటులో ఉంచాలని, నచ్చిన ఇంధనాన్ని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ వాహనదారులకు ఉండాలని ఈ20 జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈ20 పెట్రోల్‌ను గట్టిగా సమర్థిస్తున్న కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ, తన పదవికి రాజీనామా చేయాలని కోరుతోంది. మరోవైపు, ఈ20 పెట్రోల్ కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నప్పటికీ.. దీన్నుంచి తాను, తన కుటుంబం లాభాలు పొందుతోందంటూ ఆన్లైన్ పోస్టులతో పరువుకు నష్టం కలిగిస్తున్నారని కేంద్ర మంత్రి గడ్కరీ బాంబే హైకోర్టును ఆశ్రయించారు.








