పరీక్షల సంస్కరణలకు టాస్క్ ఫోర్స్.. నందన్ నీలకేని ఆధ్వర్యంలో…
కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. NAT నిర్వహించే పరీక్షల్లో ప్రశ్నా పత్రాల లీకేజీని నివారించేందుకు ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. దీనికి ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని నేతృత్వం వహిస్తారని మోదీ ప్రకటించారు. ఈ విషయాన్ని ఆదివారం ప్రకటించారు.
పరీక్షల నిర్వహణలో సాంకేతికతను గరిష్టంగా వినియోగించుకోవడం, పారదర్శక వ్యవస్థను తీర్చిదిద్దడానికి కావాల్సిన సలహాలను ఇది ఇస్తుందన్నారు. నీలకేని నేతృత్వంలో ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్, ఐబీ మాజీ డైరెక్టర్ తపన్ డెరా, మద్రాస్ ఐఐటీ డైరెక్టర్ వి. కామకోటి, విద్యాశాఖ మాజీ కార్యదర్శి అనితా కర్వాల్, లాజిస్టిక్స్ నిపుణుడు అమృతలాల్ మీనా సభ్యులుగా వుంటారు.
టాస్క్ఫోర్స్లో ఎవరున్నారంటే..
నందన్ నిలేకణి: ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు, ఆ సంస్థ నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్
ఎస్.సోమనాథ్: ఇస్రో మాజీ చైర్మన్
తపన్ డేకా: ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ డైరెక్టర్
వి.కామకోటి: ఐఐటీ మద్రాస్ డైరెక్టర్
అనితా కర్వాల్: కేంద్ర విద్యాశాఖ మాజీ కార్యదర్శి
అమృత్లాల్ మీనా: లాజిస్టిక్స్ నిపుణుడు, 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి (బిహార్ క్యాడర్).








