ఏపీఎన్ఆర్టీ రీజినల్ కోఆర్డినేటర్‌గా మలినేని ఠాగూర్ నియామకం
పెనమలూరుకు చెందిన మలినేని ఠాగూర్ ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీఎన్ఆర్టీ) రీజినల్ కోఆర్డినేటర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. పెనమలూరు గ్రామానికి చెందిన రాగూర్ ప్రస్తుతం అమెరికాలో స్థిరపడి, తానా ఫౌండేషన్ ట్రైనీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఇకపై ఆయన ఏపీఎన్ఆర్టీ రీజినల్ కోఆర్డినేటర్‌గా అమెరికా సౌత్ఈస్ట్ ప్రాంతంలో సేవలందించనున్నారు. అమెరికాలోని పలు రాష్ట్రాల్లో తెలుగు వారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి, ఇండియన్ ఎంబసీ, స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఆయన కృషి చేయనున్నారు. తనకు ఈ అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఏపీ ఎన్ఆర్ఎస్ అధ్యక్షులు రవికుమార్ వేమూరి, మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌లకు ఠాగూర్ కృతజ్ఞతలు తెలియజేశారు.








