తలనొప్పిని నిర్లక్ష్యం చేయకుండా, కొన్ని ఆహారాలతో సులభంగా తగ్గించుకోవచ్చు. అవేంటో ఈ స్టోరీలో చూద్దాం!
బాదంలో ఉండే మెగ్నీషియం రక్తనాళాలను రిలాక్స్ చేసి, తలనొప్పి నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. రోజూ కొన్ని తినండి.
బాదం పప్పులు
పొటాషియం, మెగ్నీషియం సమృద్ధిగా ఉండే అరటిపండ్లు తింటే తలనొప్పి ఇబ్బంది పెట్టకుండా త్వరగా ఉపశమనం లభిస్తుంది.
అరటిపండ్లు
పుదీనా ఆకులతో తయారు చేసిన టీ తాగడం వల్ల మెదడుకు ప్రశాంతత దొరికి, తలనొప్పి ఇబ్బంది నుంచి త్వరగా ఉపశమనం కలుగుతుంది.
పుదీనా టీ
గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగితే శరీరంలో హైడ్రేషన్ అంది, తలనొప్పి నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.
నిమ్మరసం
అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇది తలనొప్పికి కారణమయ్యే వాపును తగ్గించి, ఉపశమనం ఇస్తుంది.
అల్లం టీ
డీహైడ్రేషన్ వల్ల కూడా తలనొప్పి వస్తుంది. అందుకే రోజూ తగినన్ని నీరు తాగుతూ శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి.
నీరు ఎక్కువగా తాగాలి
ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఉండే చేపలు తింటే మెదడు ఆరోగ్యంగా ఉండి, తలనొప్పి సమస్య క్రమంగా తగ్గుతుంది.
చేపల ఆహారం
పాలకూర, బచ్చలికూర వంటి ఆకుకూరల్లో ఉండే పోషకాలు తలనొప్పిని తగ్గించడంలో అద్భుతంగా సహాయపడతాయి.
ఆకుకూరలు
ఆహారంతో తగ్గకపోతే వైద్యులను సంప్రదించాలి. జీవనశైలి మార్పులతో పాటు ఇవి పాటిస్తే తలనొప్పికి చెక్ పెట్టొచ్చు!
నిపుణుల సలహా