న్యూయార్క్ ఇండియా డే పెరేడ్ లో అడివిశేష్, పూజాహెగ్దే
టాలీవుడ్ హీరో అడివి శేష్‌కు, హీరోయిన్ పూజాహెగ్దేకు అమెరికాలో ఒక అరుదైన గౌరవం దక్కింది. ఆగస్టు 14 నుంచి 16 వరకు న్యూయార్క్ నగరంలో జరగనున్న 80వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో వారు పాల్గొంటున్నారు.
ఎంపైర్ స్టేట్ బిల్డింగ్, టైమ్స్ స్క్వేర్, ఇండియా డే పరేడ్ లాంటి మూడు ఐకానిక్ వేదికలపై జరిగే ఈ కార్యక్రమాలకు ఒక తెలుగు నటుడు ప్రాతినిధ్యం వహించడం విశేషంగా చెప్పవచ్చు.ఈ వేడుకల్లో భాగంగా మొదటి రోజు ఆగస్టు 14న ప్రతిష్టాత్మక ఎంపైర్ స్టేట్ బిల్డింగ్‌ను భారత త్రివర్ణ పతాక రంగులతో హైలెట్ అయ్యే కార్యక్రమంలో శేష్ పాల్గొనబోతున్నాడు. ఈ త్రికలర్ ఇల్యూమినేషన్ కోసం ఏర్పాటు చేసిన సెరిమోనియల్ లివర్‌ను ఆపరేట్ చేసే అవకాశం ఆయనకు దక్కనుంది. న్యూయార్క్ నగర నడిబొడ్డున ఎంతో గ్రాండ్ గా జరిగే ఈ ఈవెంట్ అక్కడి ప్రవాస భారతీయులకు చాలా స్పెషల్.
ఆ మరుసటి రోజు ఆగస్టు 15న ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ వారు టైమ్స్ స్క్వేర్ దగ్గర నిర్వహించే జెండా పండుగలో శేష్ చీఫ్ గెస్ట్‌గా హాజరవుతాడు. ఇక చివరి రోజు ఆగస్టు 16న న్యూయార్క్ లోని మాడిసన్ అవెన్యూలో జరిగే 44వ ఇండియా డే పరేడ్‌లో కూడా శేష్ ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. ఈ వేడుకల్లో హీరోయిన్ పూజాహెగ్దే కూడా పాల్గొంటున్నారు.








